
వైసీపి పై ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసిన తెలుగు దేశం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ, నంద్యాల్లో జగన్ మకాం వేసి మరీ డబ్బులు పంచుతున్నారని కంప్లైంట్ చేశారు. వైసీసి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని శుక్రవారం నాడు వారు ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాదు సచివాలయంలో టీడీపీ ఎంపీలు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి అనూప్ సింగ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపి అక్రమాలకు పాలుపడుతుందన్నారు. జగన్ నంద్యాల్లో గల్లీ గల్లీకి తిరిగి మరీ డబ్బులు పంచుతున్నారని వారు తెలిపారు. వైసీపి నేతలే కాకుండా ఇతర జిల్లాల నుండి విద్యార్థులను తీసుకొచ్చి మరీ ప్రజలకు డబ్బును పంచిపెడుతున్నారని వారు తెలిపారు. తక్షణమే వైసీపి పై తగిన చర్యలు తీసుకోవాలని పెర్కొన్నారు.