కిడ్నాపర్లను పట్టుకొంటాం: ఎస్పీ నయీం

Published : Jul 25, 2019, 09:12 AM ISTUpdated : Jul 25, 2019, 10:23 AM IST
కిడ్నాపర్లను పట్టుకొంటాం:  ఎస్పీ నయీం

సారాంశం

జషిత్ ను కిడ్నాప్ చేసిన వారెవరో త్వరలోనే పట్టుకొంటామని ఎస్పీ నయీం చెప్పారు. గురువారం నాడు ఉదయం జషిత్ ను క్షేమంగా చేర్చారు పోలీసరులు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడాారు.

మండపేట: జషిత్ ను కిడ్నాప్ చేసిన వారిని పట్టుకొంటామని ఎస్పీ నయీం చెప్పారు. గురువారం ఉదయం జషిత్ ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ దర్యాప్తును కొనసాగిస్తామని ప్రకటించారు.

జషిత్ ఇంటి వద్ద ఎస్పీ నయీం మీడియాతో మాట్లాడారు. జషిత్ ను కిడ్నాప్ చేసిన వారికి భయం పట్టుకొందన్నారు. తప్పించుకొనే పరిస్థితి లేకపోవడంతో గురువారం నాడు ఉదయం కుతకుతలూరు వద్ద చింతాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఇంటి వద్ద జషిత్ ను వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు.

ఆ ఇంటి యజమాని జషిత్ తండ్రి వెంకటరమణకు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు. జషిత్ తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు చింతాలమ్మ గుడి వద్ద జషిత్ ఉన్న ఇంటి వద్దకు డీఎస్పీతో పాటు పోలీసుల బృందం వెళ్లి జషిత్ ను తీసుకొచ్చినట్టుగా ఎస్పీ చెప్పారు.

జషిత్ ను కాపాడేందుకు ప్రయత్నించిన మీడియా, ప్రజలతో పాటు సోషల్ మీడియాలో బాలుడి క్షేమం కోసం ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. జషిత్ చాలా స్మార్ట్ అని ఎస్పీ చెప్పారు. కిడ్నాపర్లు దాచిన ఇంట్లో ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని ఇచ్చాడన్నారు. కిడ్నాపర్లు ఎవరనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu