బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

By narsimha lodeFirst Published Jul 25, 2019, 8:50 AM IST
Highlights


కిడ్నాప్ కు గురైన జషిత్ ఎట్టకేలకు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు. గురువారం నాడు ఉదయం జషిత్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రాజు అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని జషిత్ చెప్పారు.

మండపేట: రాజు అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ చెప్పారు.

గురువారం నాడు ఉదయం పోలీసులు నాలుగేళ్ల జషిత్ ను కుటుంబసభ్యులకు అప్పగించారు. తనను కిడ్నాపర్లు వేరే ఊరి వద్ద ఉంచారని జషిత్ చెప్పారు. ప్రతి రోజూ తనకు ఇడ్డీనే పెట్టేవారని జషిత్ చెప్పారు. తనను ఓ తాతయ్య వద్ద ఉంచారని జషిత్ చెప్పారు.

రాజు అనే వ్యక్తి తనను బైక్ పై తీసుకెళ్లాడని జషిత్ చెప్పారు. బైక్ పై తీసుకెళ్లిన వ్యక్తి రాజు అని జషిత్ చెప్పారు. తన వయస్సున్న బాలుడితో ఆడుకొంటున్న సమయంలోనే రాజు తనను వదిలిపెట్టినట్టుగా జషిత్ చెప్పాడు.ఆ తర్వాత కారులో ఇంటికి వచ్చానని జషిత్ తెలిపారు.

మండపేటలోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే వెంకటరమణ కొడుకు జషిత్ ను సోమవారం నాడు కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు. జషిత్ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

మీడియా, సోషల్ మీడియాల్లో కూడ విస్తృతంగా ప్రచారం సాగింది.ఈ ప్రచారంతో కిడ్నాపర్లు జషిత్ కు ఎలాంటి హని జరగకుండా వదిలిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జషిత్ ను కిడ్నాప్ చేసిన తర్వాత కూడ కిడ్నాపర్ల నుండి ఎలాంటి సమాచారం లేదు. 

సంబంధింత వార్తలు

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ

 

click me!