బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

Published : Jan 16, 2020, 03:29 PM ISTUpdated : Jan 16, 2020, 04:21 PM IST
బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

సారాంశం

ఏపీ రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ దీమాను వ్యక్తం చేశారు. 

అమరావతి:2024 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.

Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా

గురువారం నాడు విజయవాడలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి బీజేపీ అవసరం ఎంతో ఉందన్నారు. బీజేపీ, జనసేన భావజాలం ఒక్కటేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకొంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తృతీయ ప్రత్యామ్నాయమే బీజేపీ, జనసేన అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు

also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకొంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తృతీయ ప్రత్యామ్నాయమే బీజేపీ, జనసేన అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ, జనసేలతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్

తమ పార్టీ బీజేపీతో చేతులు కలపడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఎక్కడైతే తమ పార్టీ మద్దతు అవసరమో అక్కడ సంపూర్ణంగా సహకారం అందిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్రానికి లాభమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.రెండు పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం కోసం కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజధాని రైతులను వైసీపీ ప్రభుత్వం నిండా ముంచిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే నేను చెప్పాను. రాజధాని రైతుల్ని నిండా ముంచారు.2014 తర్వాత బీజేపీతో  ఎందుకు గ్యాప్ వచ్చిందో ఆ పార్టీ నాయకత్వానికి కూడ వివరించినట్టుగా ఆయన గుర్తు చేశారు.రాజధాని రైతుల్ని నిండా ముంచినట్టుగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రైతులకు టీడీపీ భరోసాను ఇవ్వలేకపోయిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 
 

.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?