ఏపీ రాష్ట్రంలో జనసేనతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బీజేపీ ఏపీరాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
అమరావతి: దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ భేషరతుగా బీజేపీతో కలిసి పనిచేసేందుకు వచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
Also read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్
undefined
గురువారం నాడు విజయవాడలోని ఓ హోటల్‌లో కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించినట్టుగా చెప్పారు. వచ్చే నాలుగున్నర ఏళ్ల పాటు కూడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఏం చేయాలనే దానిపై వ్యూహాలను అనుసరిస్తామన్నారు.
Also read:మేం గాజులు తొడుక్కోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై నందమూరి రామకృష్ణ ఫైర్
Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు
గత ప్రభుత్వం చేసిన అవినీతిపై కూడ పోరాటం చేస్తామన్నారు. తమ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రక ఘట్టంగా ఆయన చెప్పారు.ఏపీ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రెండు పార్టీల నేతలు కలిసి పోటీ చేయనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
Also read:మీరు ఒక్కటంటే నేను అంతకు మించి మాట్లాడుతా: పవన్ పై ద్వారంపూడి
Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్