డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచా వేస్తున్నామని అందులో తప్పేంటో చెప్పాలని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగిస్తున్నట్లు మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక నివాసం వద్ద డ్రోన్ల వినియోగంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వరద అంచాన కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నామని అందులో ఎలాంటి ఉద్దేశాలు తమకు లేవని తెలిపారు.
డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచా వేస్తున్నామని అందులో తప్పేంటో చెప్పాలని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగిస్తున్నట్లు మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని దాన్ని టీడీపీ రాద్దాంతం చేయడం తగదన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి మరింత వరద వచ్చే అవకాశం ఉందన్నారు. గంటగంటకు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతూనే ఉందన్నారు.
ఇకపోతే వరద వస్తే కరకట్ట వద్ద ఉన్న మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నీట మునిగిపోతుందని ముందే చెప్పామని అయితే దాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం తాము చెప్పిందే నిజమని రుజువు అయ్యిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ఈ వార్తలు కూడా చదవండి
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ
డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై
డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే