వివేకానందరెడ్డి హత్య కేసు : సీబీఐ విచారణకు హాజరైన జగన్ ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డి..

By SumaBala BukkaFirst Published Feb 3, 2023, 12:53 PM IST
Highlights

వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ సిబీఐ విచారణకు హాజరయ్యారు. 

కడప : ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిబిఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  సిబిఐ విచారణకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు అందాయి. ఈ మేరకు శుక్రవారం ఆయన సిబిఐ విచారణకు హాజరయ్యారు. గతనెల చివర్లో అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ అతని ఫోన్ కాల్ డేటాను సేకరించింది.  దీని ఆధారంగా నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి.. అతనితోపాటు వైయస్ భారతి ఇంట్లో పని చేసే నవీన్ అనే వ్యక్తికి సిబిఐ నోటీసులు జారీ చేసింది.  ఈ క్రమంలోనే  వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో జరుగుతున్న సిబిఐ విచారణకు ఈరోజు హాజరయ్యారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈనెల 28న సిబిఐ విచారించింది. నాలుగున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి కాల్ డాటా మీదనే ఎక్కువగా ఫోకస్ చేసింది సిబిఐ. ఘటన జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడాడు అనే విషయం మీదే  దృష్టి సారించింది. అతని కాల్ డేటా ప్రకారం అవినాష్ రెడ్డి ఎక్కువ కాల్స్ నవీన్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఫోన్ నెం. కు చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్.. సీఎం క్యాంపు ఆఫీస్ లోని వ్యక్తికి సీబీఐ నోటీసులు..

ఈ నేపథ్యంలోనే మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిబిఐ నవీన్ అనే నెంబర్ ఉన్న వ్యక్తికి... అతనితోపాటు జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లను,  అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరిలను ఫిబ్రవరి 10న హైదరాబాదుకు వచ్చి విచారణకు హాజరుకావాలని సిబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా, జనవరి 31న  వైసిపి నేత మాజీ మంత్రి వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత సోమవారం నాడు నవీన్ అనే వ్యక్తికి సిబిఐ నోటీసులు ఇచ్చింది.  అయితే అతను తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే పవర్ఫుల్ వ్యక్తికి సహాయకుడు కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నవీన్ తో పాటు మరొకరికి కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. అతను కూడా అత్యంత ముఖ్యమైన నేతకు సన్నిహితుడే. 

వీరిద్దరినీ హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈనెల 28న సిబిఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.  అతడిని దాదాపు నాలుగున్నర గంటల పాటు సిబిఐ విచారించింది. ఈ విచారణలో ముఖ్యంగా అతని కాల్ డేటా మీద ఆరా తీసింది. ఈ విచారణలోనే  అవినాష్ కాల్ లిస్టులో నవీన్ అనే వ్యక్తికి ఎక్కువసార్లు కాల్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే నవీన్ గురించి ఆరా తీసింది సిబిఐ. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నవీన్ అనే వ్యక్తి ఓ పవర్ఫుల్ వ్యక్తికి సన్నిహితుడని తేలింది. అంతేకాదు, సదరు వ్యక్తితో ఎవరైనా మాట్లాడాలన్నా, కలవాలన్న నవీన్ అనే అతనికి ఫోన్ చేయాల్సి ఉంటుందట.అతను ఆ సమాచారాన్ని ఆ సదరు వ్యక్తికి తెలియజేసి ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇప్పిస్తాడని సిబిఐ గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి అదే నెంబర్ కు ఎక్కువసార్లు కాల్ చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీంతో విషయం ఏంటో సమగ్రంగా ప్రశ్నించేందుకు నవీన్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

click me!