నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగతం అని చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగతం అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కోటంరెడ్డిని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అది ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసని అన్నారు. కోటంరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. రికార్డింగ్ అని తెలిసి కూడా ఫోన్ ట్యాపింగ్ అని కోటంరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డిని చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులుగా కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ట్యాపింగ్ జరగలేదని అధికారులు ఇప్పటికే చెప్పారని.. ఆధారాలు లేకుండా ఇష్టారీతినా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు.. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే కోటంరెడ్డి వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
undefined
ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదని అన్నారు. అంతకంటే మంచినేతలు పార్టీలోకి వస్తారని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడి సీఎం జగన్ మీద విమర్శలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా కోటంరెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారంటే దానికి సీఎం జగన్ కారణం కాదా? అని ప్రశ్నించారు.
శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన, ఎన్‌కౌంటర్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలను వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.