వైఎస్ వివేకా మృతి.. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇది..

By ramya NFirst Published Mar 15, 2019, 1:16 PM IST
Highlights

మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతి వెనుక హత్య కోణం ఉందనే అనుమానాలుకలుగుతున్నాయి. 

మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతి వెనుక హత్య కోణం ఉందనే అనుమానాలుకలుగుతున్నాయి. ఆయనను మొదట రక్తపు మడుగులో చూసిన పీఏ కృష్ణారెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వాంగ్మూలంలో ఆయన పేర్కొన్నది ఇదే..

‘ కృష్ణారెడ్డి వ్రాయునది ఏమనగా.. నేను ఈరోజు తెల్లవారుజామున 5గంటల 30 నిమిషాలకు వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఇంటి దగ్గరకు వెళ్లాను. కానీ.. అప్పటికి సర్ నిద్రలేవలేదు. నేను అరగంట సేపు పేపర్ చదివిన తర్వాత వైఎస్ సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేసి సర్ లేవలేదు. కావున సర్ ని నిద్రలేపుతాను అని చెప్పినాను. అందుకు సౌభాగ్యమ్మ సార్ రాత్రి లేట్ గా వచ్చి ఉంటారు. కావును నిద్రలేపవద్దు అన్నది. తరువాత అరగంటకు వంట చేసే లక్ష్మీ మరియు వారి కుమారుడు ప్రకాష్ వచ్చినారు.’

‘ అప్పుడు నేను లక్ష్మీతో సార్ అరుస్తారు.. సార్ ని లేపమని చెప్పినాను. లక్ష్మీ ఎన్నిసార్లు పిలిచినా.. సర్ పలకలేదని చెప్పింది. తర్వాత నేను పోయి పిలిచినాను. కానీ అప్పటికీ లేవలేదు. తర్వాత  వాచ్ మెన్ రంగన్న సైడ్ డోర్ తెరచి ఉన్నది అని అన్నాడు. అప్పుడు నేను, ప్రకాశ్ ఇద్దరిమూ ఒకసారి లోపలికి వెళ్లినాము. బెడ్ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉన్నది. బెడ్ రూమ్ దగ్గర బ్లడ్ దాదాపు 2లీటర్లు పడి ఉంది. కానీ సర్ లేడు. తర్వాత బాత్ రూమ్ లో చూస్తే.. అక్కడ రక్తంలో కిందపడి ఉన్నారు. తర్వాత చెయ్యి పట్టుకొని చూస్తే.. నాడీ పనిచేయడం లేదు. తల, నుదిటిపైనా, తల వెనుక, అరచేతికి గాయాలున్నాయి.’

‘నేను ప్రకాశ్ తో సర్ ఇకలేరు అని చెప్పి బయటకు వచ్చి.. సార్ అల్లుడు రాజాగారికి మరియు సౌభాగ్యమ్మగారికి చెప్పినాను. మరణానికి కారణాలు తెలియలేదు’ అని  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

related news

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం

click me!