విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే భూమిని సిద్దంగా ఉంచామని అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల 1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పందించారు.
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన 52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై రైల్వేశాఖకు లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్ మాట్లాడారు.
undefined
రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్ పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.
also read:Union Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు.
అయితే రైల్వేశాఖకు నెల రోజుల క్రితమే ఈ విషయమై లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయమై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది.