YSRCP Public Meeting: ‘సిద్ధం’ భారీ బహిరంగ  సభకు ఏలూరు సంసిద్దం..   

Published : Feb 02, 2024, 06:57 AM IST
YSRCP Public Meeting: ‘సిద్ధం’ భారీ బహిరంగ  సభకు ఏలూరు సంసిద్దం..   

సారాంశం

YSRCP Public Meeting: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది.  ఈ క్రమంలో ఏలూరు వేదికగా  ‘సిద్ధం’ అనే మరో భారీ బహిరంగను నిర్వహించబోతుంది.  ఈ నెల 3 న జరుగనున్న ఈ సభలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజక­వర్గాల నుంచి లక్షలాది మంది పాల్గొనున్నడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

YSRCP Public Meeting: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఎన్నికల శంఖారావంలో భాగంగా ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించిన తొలి బహిరంగ సభ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.  ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నారు. భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఏలూరు వేదికగా ఫిబ్రవరి 3 న వైయ‌స్ఆర్‌సీపీ సిద్దం అనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ సభకు దాదాపు లక్షలాది మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏలూరులో జరగనున్న సిద్దం మీటింగ్‌కు సంబంధించి వైఎస్‌ఆర్‌సి ప్రాంతీయ సమన్వయకర్త,ఎంపి పివి మిధున్‌రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘు­రాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య­చౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌­కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు 

110 ఎకరాల ప్రాంగణంలో..

ఏలూరు పట్టణానికి సుమారు 5 కి.మీ దూరంలో ఉన్న 110 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.  ఈ ప్రాంగణంలో భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు, వాక్‌వే ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు.. సభా ప్రాంగణం వెనుక భాగంలో ప్రత్యేక హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 50 నియోజకవర్గాల నుంచి లక్షకు పైగా ప్రజలు రానున్న క్రమంలో వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి   ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఈ మేరకు సభాస్థలికి  సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాలు, అలాగే సభస్థలికి సమీపంలోని ఆటోనగర్‌ లో 25 ఎకరాలు,  మరో రెండు ప్రాంతాల్లో పార్కింగ్‌  ఏర్పాటు చేశారు. 
 
ఎన్నికల సన్నద్ధత కోసమేనా..

ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అంతా కృషిచేయాలని, అదేవిధంగా అభిప్రాయబేధాలు, ఇతర అంశాలన్నీ పక్కనపెట్టి అంతా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, తద్వారా ఎన్నికలకు తాము కూడా సిద్ధమని చెప్పడమే  లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.  గతంలో ఏలూరులో బీసీ బహిరంగ సభ ఏవిధంగా విజయవంతమయ్యిందో .. అంతకుమించి లక్షలాది మందితో ఈ సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది.  

మరోవైపు.. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రభావం చూపకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో రెండో సభ నిర్వహించాలని భావిస్తుందట. అలాగే.. గత ఎన్నికల్లో(2019) ఈ ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించింది. దీంతో తమ పార్టీ విజయానికి ఈ ప్రాంత ప్రాముఖ్యతను సీఎం జగన్ గుర్తించారు. ఉత్తర ఆంధ్ర అనుకూలమైన ప్రాంతంగా చూస్తుంటే, ఏలూరులో జరగనున్న సిద్ధాం సమావేశం వంటి వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతంలో YSRC ప్రభావాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్