జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు న్యూఢిల్లీకి బయలుదేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానితో చర్చించనున్నట్టుగా జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ టూర్‌కి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు న్యూఢిల్లీకి బయలుదేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానితో చర్చించనున్నట్టుగా జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ టూర్‌కి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
also read:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకొనేందుకు మోడీని కలుస్తా: పవన్ కళ్యాణ్
undefined
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని ప్రధానిని కోరుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ప్రధానితో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది.విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సుమారు 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన విషయాన్ని కూడ జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంతో పాటు తిరుపతి లోక్‌సభ స్థానంలో పోటీ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడ పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది.