చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు: ఎస్ఈసీ గ్రీన్‌‌సిగ్నల్

By narsimha lode  |  First Published Feb 8, 2021, 6:34 PM IST

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.
 


అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.

తొలివిడత పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకొని పలు జిల్లాల్లో ఏకగ్రీవాల జాబితాను ఎన్నికల సంఘం పరిశీలించింది.చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అసాధరణ స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఎన్నికల సంఘం ఆరా తీసింది.

Latest Videos

undefined

also read:చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై అనుమానం: నివేదిక కోరిన నిమ్మగడ్డ

ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో పంచాయితీలు ఏకగ్రీవం కావడంపై ఎన్నికల సంఘం అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని అదికారులను ఎస్ఈసీ ఆదేశించారు.

ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎన్నికల సంఘం కమిషనర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఎస్ఈసీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై  రేపు, ఎల్లుండి డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది.

ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై  రేపు, ఎల్లుండి డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది.ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై  జిల్లాల కలెక్టర్ల నుండి వచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘానికి చేరాయి.ఈ నివేదిక ఆధారంగా ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

click me!