అసంతృప్తి తీవ్రత: చంద్రబాబు ఫొటోను తీసేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

By telugu teamFirst Published Oct 18, 2021, 8:03 AM IST
Highlights

'టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీరు పట్ల ఆయన తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నట్లు  అర్థమవుతోంది. తన ఆపీసు గోడపై చంద్రబాబు చిత్రాన్ని తొలగించడం అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

విజయవాడ: తమ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడిపై పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీరు పట్ల తన వ్యతిరేకతను కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. విజయవాడలోని తన కార్యాలంయ వెలుపల గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని ఆయన తోలగించారు. 

Chandrababu చిత్రం పటం స్థానంలో తాను రతన్ టాటాతో కలిసి ఉన్న ఫొటోను అమర్చుకున్నారు కేశినేని భవన్ బయట ఏర్పాటు చేసిన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల ఫోటోలను, ఇతర ముఖ్య నాయకుల ఫోటోను కూడా తొలగించారు. 

Also Read: చంద్రబాబుపై మరో పిడుగు: పాత గొడవను పైకి తెచ్చిన కేశినేని నాని

ఆ ఫొటోల స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన వివరాలతో ఉన్న ఫొటోలను పెట్టుకున్నారు. ఈ స్థితిలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. కేశినేని బిజెపిలో చేరుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

అయితే, తాను గానీ, తన కూతరు గానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని Kesineni nani చంద్రబాబుకు చెప్పారు. అయితే తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పారు. బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్నలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ నీర్ణయం తీసుకున్నట్లు భావించారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఆ నాయకులు కేశినేని నానిపై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: వచ్చే ఎన్నికల్లో నేను, నా కుమార్తె పోటీ చేయం: బాబుకు తేల్చిచెప్పిన కేశినేని నాని

ఆ సమయంలో తలెత్తిన వివాదం విషయంలో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పినట్లు సమాచారం. అయితే, తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తాజాగా తన కార్యాలయం వెలుపల గోడకు ఉన్న చంద్రబాబు చిత్రపటాన్ని తొలగించినట్లు భావిస్తున్నారు. ఇక టీడీపీలో ఉండలేననే స్థిర నిర్ణయానికి కేశినేని నాని వచ్చినట్లు భావిస్తున్నారు. 

click me!