వైద్యం పేరుతో మహిళపై అత్యాచారయత్నం, నరికి చంపిన భూతవైద్యుడు.. కోపంతో ఆ గ్రామస్తులు చేసిన పని..

Published : Oct 18, 2021, 07:49 AM IST
వైద్యం పేరుతో మహిళపై అత్యాచారయత్నం, నరికి చంపిన భూతవైద్యుడు.. కోపంతో ఆ గ్రామస్తులు చేసిన పని..

సారాంశం

విజయలక్ష్మిని శారీరకంగా అనుభవించాలని దుర్బుద్ధితో భూతవైద్యుడు గోపయ్య ఆమెతో మాటలు కలిపాడు.  ఆ సందర్భంలో మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నట్లు తెలుసుకున్నాడు.  నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తానంటూ నమ్మించాడు.  ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత  Rape చేసేందుకు ప్రయత్నించాడు.

భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి.. అత్యాచారయత్నానికి ప్రయత్నించడం... ప్రతిఘటించింది అంటూ... గొడ్డలితో నరికి చంపడం... విషయం తెలుసుకున్న గ్రామస్తులు ప్రతీకారేచ్ఛతో పోలీసుల ఎదుట కర్రలతో దాడికి దిగడం... ఆ పై భూత వైద్యుడిని కొట్టి చంపడం వంటి ఉదంతాలతో ప్రకాశం జిల్లా jarugumalli మండలం కామేపల్లి గ్రామం ఆదివారం రాత్రి అట్టుడికిపోయింది.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం:అనుమానంతో భార్యను తుపాకీతో చంపిన భర్త

కూలీలను పిలిచేందుకు వెళ్లి…
కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి విజయ (42) వ్యవసాయ కూలీ మేస్త్రీగా జీవనం సాగిస్తుంది. పొలంలో సోమవారం ఉదయం పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారు. వారిని పిలిచేందుకు రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయం లో వుడ్డెపాలెం వెళ్ళింది.  పనుల కోసం కూలీలను పిలుస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య (51) అనే భూతవైద్యుడు విషయాన్ని గమనించాడు.

నమ్మించి.. ఇంటికి పిలుచుకు వెళ్ళి..
విజయలక్ష్మిని శారీరకంగా అనుభవించాలని దుర్బుద్ధితో భూతవైద్యుడు గోపయ్య ఆమెతో మాటలు కలిపాడు.  ఆ సందర్భంలో మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నట్లు తెలుసుకున్నాడు.  నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తానంటూ నమ్మించాడు.  ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత 
Rape చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని పరిణామంతో విజయలక్ష్మి అతన్ని తీవ్రంగా Resistance చేసింది.

కాళ్లు.. చేతులు కట్టేసి  నరికివేత..
ఈ విషయం బయటకు తెలిస్తే తనకు ఇబ్బంది వస్తుందని  ఓబయ్య భావించాడు. ఆమెపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేసాడు.  అనంతరం గొడ్డలితో నరికి murder చేశాడు.  ఈ హత్యోదంతాన్ని తన కుటుంబీకులకు తెలియడంతో వారు  జరుగు మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఎస్సై రజియా సుల్తానా బేగం  హుటాహుటిన తన సిబ్బందితో  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  అక్కడ ఉన్న నిందితుడు ఓబయ్య ను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు.

 ఆగ్రహావేశాలతో  ఊగిన ఊరు..
విజయలక్ష్మిని  మీ దారుణంగా హతమార్చిన విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.  పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్య ను బయటకు లాగి కర్రలతో మూకుమ్మడిగా attack చేశారు.  అడ్డుకోబోయిన ఎస్ఐ రజియా సుల్తానా పైన దాడి చేశారు.  విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓబయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..

భారీగా పోలీసుల మోహరింపు…
మహిళ దారుణ హత్య,  ప్రతీకార దాడిలో నిందితుడిని జనం కొట్టి చంపడం తో జరుగుమల్లి మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సంఘటనా స్థలంలోనే ఉన్న ఎస్సై ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.  సింగరాయకొండ సీఐ ఎం లక్ష్మణ్, సర్కిల్లోని ఎస్సైలు ఏం. సంపత్కుమార్, షేక్ నాయబ్ రసూల్, యు రాంబాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు.  సమాచారం తెలిసిన వెంటనే ఒంగోలు డి ఎస్ పి నాగరాజు,  కందుకూరు డిఎస్పీ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిస్థితులపై ఆరా తీశారు.  డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరించారు.

క్షుద్రపూజలు అనుమానం…
హత్య,  ప్రతీకారం హత్య నేపథ్యంలో పోలీసులు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  విజయలక్ష్మి హత్య జరిగిన చోట 
Witchcraft  చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించే ఓబయ్య క్షుద్ర పూజలు, Exorcism చేస్తుంటాడని అంటున్నారు.  అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిందని హత్య చేశాడా?  క్షుద్ర పూజలు చేసేందుకు హత్యచేశాడా? అనే అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది.  మృతదేహంపై కొంతభాగం దుస్తులు లేకపోవడంతో  rape Attempt జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.  ఆ తర్వాత ఓబయ్య ప్రతిదాడికి పాల్పడినవారి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu