వెంకటాద్రికే పగ్గాలు: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపికపై సయోధ్య

By narsimha lodeFirst Published Jun 25, 2021, 9:26 PM IST
Highlights

కడప: కడప  జిల్బ్రలాలోని హ్మంగారి పీఠం మఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల శుక్రవారం నాడు సయోధ్య కుదిరింది. 

కడప: కడప బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల శుక్రవారం నాడు సయోధ్య కుదిరింది. బ్రహ్మంగారి పీఠాధిపతి వీరభోగవెంకటేశ్వరస్వామి మరణంతో పీఠాధిపతి ఎంపికపై వివాదం మొదలైంది. వీరభోగ వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య మహాలక్ష్మమ్మను ఆయన వివాహం చేసుకొన్నాడు. 

also read:బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి: వెల్లంపల్లికి 150 పేజీల నివేదిక అందించిన శివస్వామి

వీరబోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకు వెంకటాద్రికి పీఠాధిపతి పదవిని ఇవ్వాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. వెంకటాద్రి సోదరుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా నియమించారు. మహాలక్ష్మమ్మ కొడుకులను భవిష్యత్తు వారసులుగా నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

కుటుంబ సభ్యులంతా పీఠాధిపతి ఎంపిక విషయమై చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని   మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు  ఆదేశించారు. మంత్రి ఆదేశం మేరకు ఇటీవల కుటుంబసభ్యులు బ్రహ్మంగారి మఠంలో సమావేశమయ్యారు.  కుటుంబసభ్యులు ఈ విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి కూడ  సమాచారం పంపనున్నారు. ఇదిలా ఉంటే  కందిమల్లాయపల్లె గ్రామస్తులు వెంకటాద్రికే అనుకూలంగా ఉన్నారు.  

ఈ విషయమై గ్రామస్తులతో పాటు, కుటుంబసభ్యులతో చర్చించి ఈ వివాదంపై పరిష్కారం కోసం రాష్ట్రంలోని 14 పీఠాధిపతులు కూడ గతంలో ప్రయత్నించారు. అయితే ఈ పీఠాధిపతులు వెంకటాద్రికే అనుకూలంగా ఉన్నారని మహాలక్ష్మమ్మ ఆరోపించారు. పీఠాధిపతులను బ్రహ్మంగారి మఠం వద్దకు రాకుండా అడ్డుకోవాలని  మహాలక్ష్మమ్మ ఏపీ డీజీపీకి గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే.


 

click me!