నీ తండ్రి వైఎస్సార్ నయం... నీలా కాదు..: జగన్ పై చంద్రబాబు సీరియస్

Published : Jun 25, 2021, 05:11 PM IST
నీ తండ్రి వైఎస్సార్ నయం... నీలా కాదు..: జగన్ పై చంద్రబాబు సీరియస్

సారాంశం

సోషల్ మీడియా వేదికన తండ్రి వైఎస్ ను పొగుడుతూనే కొడుకు జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.    

అమరావతి: ప్రజావేదిక కూల్చివేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ పై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికన తండ్రి వైఎస్ ను పొగుడుతూనే కొడుకు జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.  

''ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైఎస్ జగన్ విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్ళు. దానితో తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడు. కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటీ లేదు'' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

read more  జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

''ఈ రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి.  రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయి. ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, హక్కులను కాల రాస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు'' అన్నారు. 

ఈ ముఖ్యమంత్రి తండ్రితో పాటు గతంలో ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులందరూ ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారే తప్ప.. రాష్ట్రాన్ని ఈ విధంగా తిరోగమన బాట పట్టించలేదు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో!'' అంటూ ట్విట్టర్ వేదికన ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు.    

PREV
click me!

Recommended Stories

Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్