నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ భారీ షాక్ తగిలింది. ఇటీవలనే ఆ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తెలుగు దేశం పార్టీలో చేరారు.
నెల్లూరు: రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కానుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
also read:రెండో జాబితాపై పవన్ కసరత్తు: 10 మందికి చోటు?
undefined
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం నాడు నెల్లూరులో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులో ఇవాళ జరిగిన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
also read:ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరికతో నెల్లూరు జిల్లాలో సునాయాసంగా గెలవబోతున్నామన్నారు.యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారన్నారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని చంద్రబాబు చెప్పారు.ప్రజలకు సేవే ఏకైక ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.నెల్లూరు కార్పోరేషన్ మొత్తం ఖాళీ అయిపోతోందన్నారు.
also read:12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్
వైఎస్ఆర్‌సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నామని చంద్రబాబు చెప్పారు.న్యాయం కోసం పోరాడిన సమర్ధ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు కొనియాడారు.రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు పార్టీలోకి స్వాగతిస్తున్నాన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేకతేనని చెప్పారు.ప్రశ్నించిన వారిని వేదించడమే జగన్ పని అన్నారు.
చంద్రబాబు గారి సమక్షంలో కుటుంబ సభ్యులు, అనుచరులతో సహా టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. pic.twitter.com/WCYsP9W3UB
— Telugu Desam Party (@JaiTDP)ప్రజా సేవకు అంకితమైన ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.అహంకారంతో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ విధానాలు నచ్చకే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు చెప్పారు.విశాఖపట్టణాన్ని దోచేసిన వ్యక్తిని వైఎస్ఆర్‌సీపీ నెల్లూరుకు పంపుతుందని చంద్రబాబు విమర్శలు చేశారు.