15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పుంజుకోదు.. జగన్ ఎన్డీయేలోకే రావాలి, అప్పుడే ఏపీ అభివృద్ధి: కేంద్రమంత్రి సంచలనం

By Siva KodatiFirst Published Oct 17, 2021, 5:47 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (republican party of india) చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (ramdas athawale) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే (NDA) కూటమిలోకి వైసీపీ  (ysrcp) చేరాలని ఆయన సూచించారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (republican party of india) చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (ramdas athawale) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే (NDA) కూటమిలోకి వైసీపీ  (ysrcp) చేరాలని ఆయన సూచించారు. కేంద్రంలో భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి అని అథవాలే వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌లు, రహదారులు పూర్తి చేసుకోవచ్చని... పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ (congress) హయాంలో కూడా జరిగిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని రామ్‌దాస్ అథవాలే స్పష్టం చేశారు. 

ఇక కొద్దిరోజుల క్రితం 2004లోనే సోనియాగాంధీ (sonia gandhi) ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని రాందాస్ వ్యాఖ్యానించి దుమారం రేపారు. ఆమె విదేశీ మూలాల వాదనకు అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఎస్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ (us vice president) కమల హ్యారిస్‌ను (kamala harris) రామ్‌దాస్ ప్రస్తావించారు. యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని తాను ప్రతిపాదించినట్టు ఆయన గుర్తుచేశారు.

ALso Read:ఆజాద్ ను కాంగ్రెస్ నామినేట్ చేయకుంటే.. మేం చేస్తాం : అథవాలే సంచలనం...

ఇండో అమెరికన్‌ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. సోనియాగాంధీ మన దేశానికి ఎందుకు ప్రధాని కాకూడదని ప్రశ్నించారు. ఆమె రాజీవ్‌గాంధీ (rajeev gandhi) సతీమణి, లోక్‌సభ సభ్యురాలని అన్నారు. అలాగే 2004లో మన్మోహన్‌సింగ్‌ను (manmohan singh) కాకుండా శరద్‌పవార్‌ను (sharad pawar) ప్రధానిని చేస్తే బావుండేదని రామ్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ (captain amrinder singh) ఎన్డీయేలోకి రావాలంటూ అథవాలె ఆహ్వానించి సంచలనం రేపారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో (punjab assembly elections) ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.

click me!