చిత్తూరులో అత్యధికం:ఏపీలో మొత్తం కరోనా కేసులు 20,60,472కి చేరిక

By narsimha lodeFirst Published Oct 17, 2021, 5:10 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో31,712 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 432 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కరోనా  బారిన పడి  ఐదుగురు మృత్యువాతపడ్డారు. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా  కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో31,712 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 432 మందికి కరోనా నిర్ధారణ అయింది.  Andhra pradeshలో కరోనా కేసులు 20,60,472కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా  బారిన పడి  ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,307 కి చేరింది. 

also read:229 రోజుల దిగువకు పడిపోయిన కోవిడ్ కేసులు: ఇండియాలో మొత్తం 3,40,67,719కి చేరిక

గడిచిన 24 గంటల్లో 586 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 40వేల 131 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 6034యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,89,85,845 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో010,చిత్తూరులో 087, తూర్పుగోదావరిలో029,గుంటూరులో061,కడపలో 008, కృష్ణాలో080, కర్నూల్ లో006, నెల్లూరులో045, ప్రకాశంలో 041,విశాఖపట్టణంలో 039,శ్రీకాకుళంలో012, విజయనగరంలో 006,పశ్చిమగోదావరిలో 030కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కృష్ణాలో ఇద్దరు కరోనాతో మరణించారు. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.
 .దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,307కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,7396, మరణాలు 1093
చిత్తూరు-2,45,762, మరణాలు1937
తూర్పుగోదావరి-2,92,897, మరణాలు 1289
గుంటూరు -1,77,362,మరణాలు 1228
కడప -1,15,381, మరణాలు 644
కృష్ణా -1,18,533,మరణాలు 1410
కర్నూల్ - 1,24,077,మరణాలు 852
నెల్లూరు -1,46,015,మరణాలు 1050
ప్రకాశం -1,38,217, మరణాలు 1115
శ్రీకాకుళం-1,22,866, మరణాలు 785
విశాఖపట్టణం -1,57,302, మరణాలు 1124
విజయనగరం -82,870, మరణాలు 670
పశ్చిమగోదావరి-1,78,542, మరణాలు 1110

 

: 17/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,577 పాజిటివ్ కేసు లకు గాను
*20,37,236 మంది డిశ్చార్జ్ కాగా
*14,307 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,034 pic.twitter.com/oxCfZTOxeC

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!