చంద్రబాబు నివాసానికి బీజేపీ,జనసేన నేతలు: సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు

By narsimha lodeFirst Published Mar 11, 2024, 1:29 PM IST
Highlights

తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య ఇవాళ చర్చలు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే దానిపై చర్చలు సాగుతున్నాయి.
 


అమరావతి:  పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతలు  సోమవారంనాడు చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు.రెండు రోజుల క్రితం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.  30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనకు టీడీపీ కేటాయించింది.  ఇప్పటికే  ఆరు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది.  94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. తాజాగా బీజేపీ కూడ పొత్తులో భాగస్వామ్యపార్టీగా చేరడంతో  ఆ పార్టీకి కూడ కేటాయించే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల విషయమై  చర్చించనున్నారు.

also read:నిడదవోలు నుండి జనసేన పోటీ: కందుల దుర్గేష్‌ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా,  జనసేన తరపున  నాదెండ్ల మనోహర్, చంద్రబాబు,అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్  సహా మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

also read:మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)

సీట్ల షేరింగ్ పై మూడు పార్టీల మధ్య స్పష్టత వచ్చింది. అయితే  మూడు పార్టీలు ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రానికి లేదా రేపటి వరకు పోటీ చేసే స్థానాల విషయంలో  ఏ పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిపై  స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకుంటే  ప్రచారాన్ని వేగవంతం చేయవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు.

also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్

ఈ నెల  17న చిలకలూరిపేటలో  సభ నిర్వహించనున్నారు.ఈ సభలో మూడు పార్టీల నేతలు కూడ పాల్గొంటారు. ఈ సభకు మోడీని కూడ ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతుంది.కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి,పి.గన్నవరం వంటి అసెంబ్లీ స్థానాలు సహా ఇతర స్థానాలపై నేతల మధ్య చర్చ సాగుతుంది.మరో వైపు పార్లమెంట్ స్థానాల్లో  ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

click me!