నిడదవోలు అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు ఇవాళ జనసేన అధికారికంగా ప్రకటించింది.
అమరావతి: నిడదవోలు అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ పోటీ చేయనున్నారు.ఈ మేరకు సోమవారం నాడు జనసేన అధికారికంగా ప్రకటించింది. రాజమండ్రి రూరల్ స్థానం నుండి కందుల దుర్గేష్ ను బరిలోకి దింపాలని జనసేన భావించింది.
also read:మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)
undefined
అయితే ఈ స్థానంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత మాసంలో టీడీపీ, జనసేన ప్రకటించిన తొలి విడత జాబితాలో రాజమండ్రి రూరల్ స్థానాన్ని ప్రకటించలేదు. ఈ ఇద్దరు అభ్యర్థులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే.
also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్
రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాదని జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ను బరిలోకి దింపడంపై రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ పోటీ చేస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత మాసంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
also read:వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింక్: రిపోర్ట్
రాజమండ్రి రూరల్ స్థానంలో సిట్టింగ్ సీటును వదులుకోవడానికి టీడీపీ సానుకూలంగా లేదు. ఈ విషయమై జనసేనతో చర్చించింది. నిడదవోలు అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. దరిమిలా కందుల దుర్గేష్ ను నిడదవోలు నుండి జనసేన బరిలోకి దింపింది.ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించారు.
తెలుగుదేశం-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది.జనసేన,బీజేపీకి 30 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం కేటాయించింది. ఇప్పటికే ఐదు స్థానాలను జనసేన ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన నిడదవోలు స్థానంతో జనసేన ఆరు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది.