హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించిన విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు రాసిన లేఖపై అమిత్ షా స్పందించారు. ఈ లేఖ అందిందని అమిత్ షా రఘురామకృష్ణం రాజుకు ఇవాళ లేఖ పంపారు.
న్యూఢిల్లీ: వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించిన విషయమై రాసిన లేఖ తనకు అందిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు.
పార్లమెంట్ నాలుగో గేటు వద్ద తనను ఎంపీ Gorantla madhav బెదిరించారని వైసీపీ రెబల్ ఎంపీ Raghurama krishnam raju ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రధానమంత్రి Narendra Modi, కేంద్ర హోంశాఖ మంత్రి Amit shah ,లోక్‌సభ స్పీకర్ Om Birla కు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖలు రాశారు. ఈ లేఖ ప్రతి తనకు అందిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రత్యుత్తరం పంపారు.
undefined
also read:రఘురామ కృష్ణంరాజుకు ఏం జరిగినా... జగన్ సర్కారుదే బాధ్యత: టిడిపి ఎమ్మెల్సీ మంతెన ఆందోళన
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామం జరిగిన తర్వాత ఈ ఏడాది ఆగష్టు మాసంలో పార్లమెంట్ నాలుగో గేటు వద్ద హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు అప్పట్లో ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా మీడియా సమావేశాలు పెట్టినా కూడా తన అంతు చూస్తానని బెదిరించారని రఘురామకృష్ణంరాజు అప్పట్లో ఆరోపించారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా అక్కడే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో రికార్డైందన్నారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఆయన అప్పట్లో మీడియాకు వివరించారు.
రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వైసీపీ తరపున విజయం సాధించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు వైసీపీకి దూరమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే నెపంతో ఆయనపై చర్యలకు వైసీపీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. రఘు రామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరింది.
ఈ మేరకు రెండు దఫాలు లోక్‌సభ స్పీకర్ కు రెండు దఫాలు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణంరాుజును అరెస్ట్ చేశారు. అయితే ఈ సమయంలో తనను చిత్రహింసలు పెట్టారని కూడా ఆయన కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసినందుకే తనపై కక్షపూరితంగానే ఈ కేసులు బనాయించారని రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు.
జగన్ సర్కార్ తీసుకొనే నిర్ణయాలపై రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు విమర్శల వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్గించే ఉద్దేశ్యంతోనే రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.