పవన్, బాబు విమర్శలు: హైదరాబాద్ కు ఇసుక రవాణాకు జగన్ చెక్

By narsimha lode  |  First Published Nov 12, 2019, 3:18 PM IST

ఇసుకను అధిక ధరకు విక్రయిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను విధిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.ఈ  విషయమై కేబినెట్ లో నిర్ణయం తీసుకొంటామన్నారు. ఇసుక కొరత లేకుండా వారోత్సవాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. 


విజయవాడ: ఇసుక కొరతపై రాష్ట్రంలో విపక్షాలు ఆందోళనను తీవ్రం చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడ రంగంలోకి దిగింది. ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకొంది. ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే  జరిమానాతో పాటు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

Also Read:దీక్షకు అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి... చంద్రబాబు లేఖ

Latest Videos

undefined

మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇసుక కొరతపై  క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో  ఇసుక కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

 ఈ నెల 14 నుంచి 21 వరక ఇసుక వారోత్సవాలను నిర్వహించనున్నట్టుగా సీఎం ప్రకటించారు. వరదలు కారణంగా ఇసుక రీచ్‌లు మునిగిపోయాని సీఎం చెప్పారు. ఈ కారణంగానే ఇసుకను డిమాండ్ మేరకు వినియోగదారులకు అందించలేకపోతున్నట్టుగా  సీఎం జగన్ చెప్పారు.

Also Read:చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

గతంలో ప్రతి రోజూ సరాసరి 80 వలే టన్నుల ఇసుకను సరఫరా చేసేవాళ్లమని సీఎం గుర్తు చేశారు.అయితే గత వారం నుండి పరిస్థితి మరింత మెరుగైందన్నారు. ప్రతి రోజూ 1.20 లక్సల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు.

 ఇసుకను సరఫరా చేసే రీచ్‌ల సంఖ్య కూడ పెరిగిందన్నారు సీఎం జగన్. గతంలో ప్రతి రోజూ 60 ఇసుక రీచ్ లనుండి ఇసుకను సరఫరా చేస్తే ప్రస్తుతం 90 రీచ్‌ల నుండి ఇసుకను సరఫరా చేస్తున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు.

వచ్చే వారానికి ఇసుక సరఫరాను మరింత పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ 1.2 లక్షల టన్నుల నుండి రెండు లక్షల టన్నులకు పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180 కు పెంచాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, ఇంచార్జీలను స్టాక్‌ పాయింట్ల వారీగా నియమించినట్టుగా సీఎం చెప్పారు. ఇసుక స్టాక్‌ పాయింట్లలో ఇసుక రేట్లను జేసీలతో పాటు, ఇంచార్జీలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారు.

ఆయా నియోజకవర్గాల్లో ఇసుకకు ఎంత ధరను నిర్ణయించాలని ఆయన చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో రేటు కార్డులను డిస్‌ప్లే చేయాలని  సీఎం ఆదేశించారు.ఇసుకను ఎక్కువ రేటుకు విక్రయిస్తే జైలు శిక్షతో పాటు పెనాల్టీ విధిస్తామని జగన్ చెప్పారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని  ఆయన స్పష్టం చేశారు.

 ఇసుక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాల వారీగా ధరల విషయాన్ని ప్రచారం చేయాలని  అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక తవ్వకాల్లో కానీ, విక్రయాల్లో కానీ సిబ్బంది  కానీ సెలవులు తీసుకోకుండా పనిచేయాలని జగన్ సూచించారు. 

సరిహద్దు ప్రాంతాల్లో  ప్రతి చోటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌అండ్‌బి, ఎపీ ఎండీసీ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలనిజగన్ అధికారులను కోరారు. 

click me!