అమరావతికి షాక్: ప్రాజెక్టు నుండి తప్పుకొన్న సింగపూర్

Published : Nov 12, 2019, 01:01 PM IST
అమరావతికి షాక్: ప్రాజెక్టు నుండి తప్పుకొన్న సింగపూర్

సారాంశం

అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి తప్పుకొంటున్నట్టుగా సింగపూర్ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. రెండు ప్రభుత్వాల మధ్య అంగీకారంతోనే ఈ ప్రాజెక్టు నుండి వైదొలగినట్టుగా ప్రకటించింది.


అమరావతి: క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి తప్పుకొన్నట్టుగా సింగపూర్ ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించారు.  రెండు ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  రాజధాని స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్‌‌పై ముందుకు వెళ్లకూడదని  ఏపీ ప్రభుత్వం సింగపూర్‌ను కోరింది.ఈ విషయాన్ని సింగపూర్ ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. మినిష్టర్ ఇంచార్జీ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ ఎస్. ఈశ్వరన్ ప్రకటించారు.

గతంలో 6.84 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను  అభివృద్ది చేసేందుకు అప్పటి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  సింగపూర్ కన్సార్టియం 2017లో ఏపీ  ప్రభుత్వంతో రాజధాని స్టార్టప్ ఏరియాను అభివృద్ది చేసేందుకు ఒప్పందం చేసుకొంది. 

ఈ ఒప్పందం రద్దు కావడంతో మిలియన్ డాలర్ల మేర ప్రభావం ఉంటుందని కన్సార్టియం కంపెనీలు చెబుతున్నాయి. భారత్‌లోని ఇండియాలో తమ పెట్టుబడులపై ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.ఇండియా ఓ అద్బుతమైన అవకాశాలు కలిగిన అతి పెద్ద మార్కెట్ గా నేటికి తాము భావిస్తున్నట్టుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. 

మొత్తం 1691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్ట్ అప్ ఏరియా ను అభివృద్ధి చేసేలా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న విషయం తెలిసిందే.రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ ఒప్పందం నుండి వైదొలిగినట్టుగా ప్రకటించారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్