దుబాయ్ లో భార్య.. ఇండియాలో భర్త.. ఆమె డబ్బులు పంపపడం లేదని..

By narsimha lodeFirst Published Nov 12, 2019, 12:32 PM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సార్సా గ్రామంలో దుబాయ్‌లో ఉన్న భార్య డబ్బులు పంపడం లేదనే నెపంతో ఇద్దరు పిల్లలను విచక్షణ రహితంగా కొట్టాడు తండ్రి. తాను పిల్లలను కొడుతున్న సమయంలో తీపిన వీడియోలను భార్యకు పంపాడు. 

ఏలూరు: దుబాయ్‌కు వెళ్లిన తన భార్య  డబ్బులు పంపడం లేదనే నెపంతో ఏషియా అనే వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను బెల్టులతో చితకబాదాడు.ఈ వీడియోను తన భార్యకు పంపాడు.  ఈ వీడియోలను చూసిన తర్వాత బాధితుల తల్లి విజయలక్ష్మి కోరిక మేరకు  పిల్లల మేనమామ పిల్లలను తీసుకెళ్లాడు.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని సార్సా గ్రామంలో చోటు చేసుకొంది.

Alsor read:ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్

ఏడేళ్ల క్రితం ఏషియా, విజయలక్ష్మిలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఏషియా మాత్రం ఎలాంటి పనులు చేయడం లేదు. పెద్ద కూతురు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకొంది.ఈ వివాదం కారణంగా విజయలక్ష్మి పుట్టింట్లోనే ఉంది.

పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించడంతో భార్యాభర్తలు కాపురం చేశారు. ఏషియా ఏ పని చేయకపోవడంతో విజయలక్ష్మి తమ పిల్లలను పోషించేందుకు గాను  విజయలక్ష్మి  దుబాయ్‌కు వెళ్లింది.

Also read:విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

దుబాయ్ నుండి భర్తకు ప్రతి నెలా డబ్బులను పంపేది.. అయితే ఈ డబ్బులను తీసుకొన్న ఏషియా పిల్లల బాగోగులు చూడలేదు. మద్యానికి బానిసగా మారాడు. అంతేకాదు పిల్లల కోసం పంపిన డబ్బులను  కూడ మద్యం కోసం ఉపయోగించేవాడు.

Also Read:ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

ఈ విషయం తెలిసిన విజయలక్ష్మి ఏషియాకు డబ్బులు పంపడం నిలిపివేసింది. దీంతో మద్యానికి  బానిసగా మారిన ఏషియా తన పిల్లలపై ప్రతాపం చూపాడు. పిల్లలను బెల్ట్‌తో పాటు, కరెంటు వైర్లతో ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు.

పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి  తన భార్య విజయలక్ష్మికి ఫోన్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలను చూసిన తర్వాత  విజయలక్ష్మి తన పిల్లలను తీసుకెళ్లాలని సోదరుడిని కోరింది.

విజయలక్ష్మి సూచన మేరకు పిల్లల మేనమామ ఆ పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి వద్దకు వెళ్లబోమని పిల్లలు చెబుతున్నారు. రక్తాలు వచ్చేలా పిల్లలను ఏషియా తీవ్రంగా కొట్టాడు.

తండ్రి వద్దకు వెళ్తే తాము బతకలేమని ఆ పిల్లలు భయపడుతున్నారు. కన్నబిడ్డలను చిత్రహింసలు పెట్టిన  ఏషియాను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఏషియాపై కేసు  నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పిల్లల బంధువులు కోరుతున్నారు.

కన్న తండ్రే తమ పిల్లలను పైశాచికంగా కొట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇలా చేయడాన్ని తప్పుబుడుతున్నారు. భవిష్యత్తులో మరొకరు ఇలా చేయకుండా ఏషియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

click me!