జగన్ కేసులో ట్విస్ట్ : కోర్టుకెక్కిన శ్రీనివాస్ తరుపు న్యాయవాది

By Nagaraju TFirst Published Jan 12, 2019, 5:09 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ పై దాడికేసులో విచారణ చేపడుతున్న ఎన్ఐఏ వ్యవహార శైలిపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 

విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జగన్ పై దాడికేసులో విచారణ చేపడుతున్న ఎన్ఐఏ వ్యవహార శైలిపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

నిందితుడు శ్రీనివాసరావును లాయర్ సమక్షంలో విచారించే వెసులుబాటు కల్పిస్తూ ఎన్ఐఏ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అయితే విచారణ పేరుతో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లారని కనీసం ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పడం లేదని ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు.  

ఎన్ఐఏ కోర్టు శ్రీనివాసరావును కస్టడీలో తీసుకునే సమయంలో ఎన్ఐఏ అధికారులకు పలు సూచనలు చేసింది. నిందితుడుని కస్టడీలో తీసుకున్నసమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, మూడు రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. 

అలాగే న్యాయవాది సమక్షంలోనే శ్రీనివాసరావును విచారించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లాయర్ సలీం తన పిటీషన్లో ప్రస్తావించారు. తక్షణమే నిందితుడి ఎక్కడ ఉన్నా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సిట్ అధికారులను తాను కలిసినట్లు తెలిపారు. 

అయితే సిట్ అధికారులు సైతం శ్రీనివాసరావును విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉంచుతారా, విజయవాడ ఉంచుతారా, లేక హైదరాబాద్ తీసుకెళ్తారా అన్నది వారికి కూడా తెలియడం లేదన్నారు. ఎన్ఐఏ కోర్టు ఆదేశాలతో శనివారం నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

కస్టడీలోకి తీసుకున్న వెంటనే శ్రీనివాసరావును ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. అయితే శ్రీనివాసరావును విశాఖపట్నంలోని విమానాశ్రయంకు తీసుకు వెళ్లారా లేక విజయవాడలోనే విచారిస్తున్నారా అన్న అంశాలపై చర్చనీయాంశంగా మారింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడికేసులో ఎన్ఐఏ దూకుడు: రహస్య ప్రదేశానికి శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు...నార్కో పరీక్షకు సిద్దమే: నిందితుడి తరపు లాయర్

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

జగన్ పై దాడి కేసు: హాజరు కానీ శ్రీనివాస్ తరపు లాయర్, 25కు వాయిదా

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్ దాడి కేసు: విజయవాడకు నిందితుడు శ్రీనివాస్

 

click me!