ఉద్యోగినితో పృథ్వీ అసభ్య సంభాషణ: విచారణకు టీటీడీ ఛైర్మెన్ ఆదేశం

By narsimha lode  |  First Published Jan 12, 2020, 3:39 PM IST

ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్  పృథ్విరాజ్ ఆడియో సంభాషణ విషయమై విచారణ ఆదేశించారు టీటీడీ ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి.


అమరావతి: ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్  పృథ్విరాజ్ ఆడియో సంభాషణ విషయమై విచారణ ఆదేశించారు టీటీడీ ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి. ఆదివారం నాడు సాయంత్రం లోపుగా విచారణ నివేదికను  ఇవాలని ఆయన విజిలెన్స్ శాఖకు ఆదేశించారు.

ఆదివారం నాడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆడియో సంభాషణ విషయమై ఎస్వీబీసీ చానెల్‌ పృథ్వీరాజ్‌ తో కూడ తాను మాట్లాడినట్టుగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Latest Videos

undefined

also read:మరో వివాదంలో ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ: మహిళా ఉద్యోగినికి ఐలవ్‌యూ అంటూ

తన ఆడియోను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తనను ఓ వర్గం టార్గెట్ చేసిందని  పృథ్వీరాజ్ చెప్పారు. ఈ విషయమై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత  సీఎం జగన్ కు నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. నివేదిక తర్వాత  చర్యలు ఉంటాయన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ కూడ టీటీడీలో కూడ భాగమేనని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగినితో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా ఉద్యోగినితో పృథ్వీరాజ్ మాట్లాడిన సంభాషణపై సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి మండిపడ్డారు. మహిళా ఉద్యోగినులను పృథ్వీరాజ్ వేధింపులకు పాల్పడినట్టుగా మురళి చెప్పారు.

click me!