వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య రాళ్ల దాడి: కాకినాడలో ఉద్రిక్తత, పలువురికి గాయాలు

By narsimha lode  |  First Published Jan 12, 2020, 1:31 PM IST

కాకినాడలో ఆదివారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య  పరస్పరం  రాళ్లు రువ్వుకొన్నారు. 


కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యా‌ణ్‌పై వ్యాఖ్యలకు నిరసనగా  జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య పరస్పరం  రాళ్లు రువ్వుకొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకొంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Also read:రాజధానిని మార్చితే అగ్గి రాజుకొంటుంది: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

Latest Videos

undefined

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఆదివారం నాడు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. భానుగుడి సెంటర్ నుండి జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వైపు ర్యాలీగా వెళ్లారు.

అయితే  ఈ విషయం తెలుసుకొన్న వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడి ఒకరికి వ్యతిరేకంగా మరోకరు తిట్టుకొన్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు.  వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను తిప్పికొట్టారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద  భారీగా పోలీసులు మోహరించారు.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రాళ్ల దాడిలో పలువురు జనసేన  కార్యకర్తలు గాయపడ్డారు.

click me!