రాజధానిని మార్చితే అగ్గి రాజుకొంటుంది: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Jan 12, 2020, 12:46 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి మార్చడంపై  జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. 



అమరావతి: అమరావతి నుండి రాజధానిని మార్చితే  రాయలసీమ ఉద్యమం రావడం ఖాయమని మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను హెచ్చరించారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అంశాన్ని రెండు కులాల మధ్య చిచ్చుగా మార్చారని జగన్‌పై ఆయన మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాజధానిని మార్చేందుకు జగన్  కుట్ర పన్నుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.

Latest Videos

undefined

Also read:మారుతున్న ఏపీ రాజకీయం: టీడీపీ,లెఫ్ట్, జనసేనల మధ్య పొత్తు?

అమరావతి నుండి రాజధానిని మార్చితే కడపలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడప అన్ని జిల్లాలకు దగ్గరగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిని మార్చితే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తప్పదని  జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.

Also read:మున్సిపల్ ఎన్నికలు: చంద్రబాబుతో పొత్తుకు పవన్ కల్యాణ్ రెడీ?

రాజకీయంగా తనను జగన్ ఏమీ చేయలేడని.. కానీ ఆర్థికంగా తనను రోడ్డున నిలబెట్టేందుకు జగన్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయన్నారు. గత 75 ఏళ్లలో ఇంతవరకు అమరావతికి ఎలాంటి వరదలు రాలేదని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.

Also read:మీ వెంటే నేను: సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరం

అమరావతిలో అన్ని కూడ తాత్కాలిక భవనాలు అంటూ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దివాకర్ రెడ్డి చెప్పారు. పిల్ల చేష్టలతో రాజధానిని మార్చితే అగ్గికావడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. 

click me!