Top Stories : చంద్రబాబుకు బెయిల్, కేసిఆర్ కుటుంబం బిచ్చం ఎత్తుకోవడమే.. రైతుబంధుకు నో....

By SumaBala Bukka  |  First Published Nov 21, 2023, 7:40 AM IST

నేటి టాప్ స్టోరీస్ లో..  అన్ని పత్రికల్లో ప్రధానంగా  మాజీ ముఖ్యమంత్రి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై  ప్రధానంగా వార్తలు ప్రచురించాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగం, సోమవారం తెలంగాణలో పర్యటించిన అమిత్ షా ప్రసంగం ప్రముఖంగా ఉన్నాయి. వీటితోపాటు ఈరోజు టాప్ స్టోరీస్  ఇవే..


1
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ :  చంద్రబాబు నాయుడుకి బెయిలు మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

అమరావతి : చంద్రబాబుపై పెట్టిన కేసులో సాక్షాలు ఎక్కడా? అంటూ ఆంధ్ర జ్యోతి చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై పెట్టిన కేసులు సాక్షాలు సరిగా లేవంటూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందంటూ పేర్కొంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ ఊరట నిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్  స్కాం  కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలుకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయని 29వ తేదీ నుంచి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ కేసులో దుర్వినియోగం అయినట్టుగా చెబుతున్న సొమ్మును టిడిపి బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టు  తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి కథనం  ప్రచురించింది.

Latest Videos

undefined

చంద్రబాబు బెయిల్ కథనాలు

కెసిఆర్ పాలన అంటే మేడిగడ్డ కుంగడమేనా?

మెదక్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోవడమే కేసిఆర్ అభివృద్ధి నమూనాల అంటూ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఊదరగొడుతున్నట్లుగా రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు పళ్లెంలో తింటుందని ఆరోపణలు చేశారు. మద్యానికి  గేట్లు తెరిచి తెలంగాణను బెల్ట్ షాపుల రాష్ట్రంగా చేశారని,  దేశంలోనే నెంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు అంటూ విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అందుకే చెప్పుకోవడానికి ఏమీ లేక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని రేవంత్ రెడ్డి  బీఆర్ఎస్  నేతల మీద విరుచుకుపడ్డారు. కెసిఆర్ సింగిల్ విండో డైరెక్టర్ అయి రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించింది.. ఇందిరమ్మ రాజ్యంలోనేనని.. ఇందిరమ్మ రాజ్యం లేకపోయినా,  సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయినా.. కేసిఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరో,  బిర్లా మందిర్ దగ్గరో  బిచ్చం ఎత్తుకునే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది.

పూర్తి కథనం

ఆ నిధులన్నీ ఎన్నికల తర్వాతే..

హైదరాబాద్ :  తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రైతులు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించే విషయం వెలుగు చూసింది.  రైతుబంధు నిధుల విడుదల, రుణమాఫీ, డిఏ లను అందించడం ఆపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సమయంలోను వీటిని అందజేయడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఈసీఐ సోమవారం తిరస్కరించింది.  పోలింగ్ తేదీ దగ్గర పడింది, తొమ్మిది రోజుల్లో పోలింగ్ ఉంది.ఈ సమయంలో నిధులు ఎలా విడుదల చేస్తారని.  వీటికి అనుమతి ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పింది. కాంగ్రెస్, బిజెపి.. ఈ నిధుల విడుదలపై టీఆర్ఎస్ మీద అనేక ఫిర్యాదులు చేశాయి. గత ఎన్నికల సమయంలో కూడా రైతుబంధు చెల్లింపులు జరిపారని ఆరోపించాయి. ఈ మేరకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశాయి. ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది.

కొడుకుని సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం… అమిత్ షా

వరంగల్ : బిజెపి పార్టీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. సోమవారం నాడు జనగామ కేంద్రంలో,  జగిత్యాల జిల్లా కోరుట్లలో బిజెపి బహిరంగ సభ జరిగింది. ఈ విజయ సంకల్ప సభల్లో  అమిత్ షా ప్రసంగించారు.  బిజెపి అధికారంలోకి రాగానే అవినీతిపరులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమంటూ చెప్పుకోచ్చారు.  మిషన్ భగీరథ, ఓఆర్ఆర్, కాలేశ్వరం, మియాపూర్ భూములు, పాస్పోర్ట్లు,  గ్రానైట్ కుంభకోణాలపై విచారణ చేస్తామని, అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.  సభ ప్రారంభానికి ముందు భైరాంపల్లి అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు. సోమవారం రాత్రి హైదరాబాదులోని ఉప్పల్ బిజెపి అభ్యర్థి ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ కు మద్దతుగా నాచారంలో రోడ్ షో నిర్వహించారు. ఈ వార్తను ఈనాడు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది. 

Amit shah... తెలంగాణ ప్రజలకు మూడు దీపావళి పండుగలు: బీజేపీ సభల్లో అమిత్ షా

ధరణి తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ..  కేసీఆర్

కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాటి ఎన్నికల ప్రచార సభల్లో  కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ భూమాత అనే పోర్టల్ ను తీసుకువస్తానని చెప్పడంపై  టార్గెట్ చేశారు. ‘కాంగ్రెస్ వారు తెచ్చేది భూమాత కాదు భూమేత’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోకి వస్తే మళ్లీ దళారి వ్యవస్థ మొదలవుతుందంటూ ఆరోపించారు. మరోవైపు బిజెపి మీద కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు..  వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశించిన ప్రధాని అధ్యక్షతన ఉన్న పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అలా పెట్టమని అన్నందుకు ఐదేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 25వేల కోట్ల నిధులను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తను పూర్తిగా ఈనాడు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

ధరణి తీసేస్తే.. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే : ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక

డిసెంబర్ మూడో తేదీన ఓట్ల లెక్కింపుకు  49 కేంద్రాలు…

హైదరాబాద్ : తెలంగాణలో ఓట్ల పండుగ దగ్గర పడుతోంది. గడువు చేతి వేళ్ల మీద లెక్కపెట్టుకునే రోజుల్లోకి మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగే మూడో ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో  ఉత్కంఠ నెలకొంది. 30వ తేదీన  పోలింగ్ జరిగిన తర్వాత.. ఓట్ల లెక్కింపుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా..  పోలైన ఓట్లను 49 ప్రాంతాల్లో లెక్కించేలా.. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు పంపిన ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి డిసెంబర్ మూడో తేదీని నిన్న ఇస్తూ గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు ప్రచురించింది.

ఆ వారం ఆగ్రనేతలంతా  రాష్ట్రంలోనే…

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పోటా పోటీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి.  ఇక కొద్ది రోజులే మిగిలి ఉండడంతో చివరి వారం రోజులపాటు అన్ని పార్టీలకు చెందిన అగ్ర నేతలు రాష్ట్రంలోనే ఉండబోతున్నారు. అగ్రనేత ప్రచారంతో ఆఖరివారం రాష్ట్రమంతా  మారుమోగిపోతుంది. బిజెపి తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులంతా ప్రచారంలో పాల్గొంటారు.  టిఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, బిజెపికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  సిపిఎం అగ్ర నేతలు సీతారాం ఏచూరీ, బృందాకారత్, ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక ప్రముఖ జాతీయ, రాష్ట్ర నేతలందరూ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వనన్నారు.  దీనికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రచురించింది. 

విశాఖ  ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వార్తను సాక్షి బ్యానర్ ఐటంగా ప్రచురించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు మొదట యూట్యూబర్ కారణమని  అనుమానించి, అతని కోసం తీవ్ర గాలింపు చేపట్టి, అరెస్టు చేశారు. కానీ యూట్యూబర్ నాని ప్రాథమిక విచారణలో అతని మీద అనుమానాలు నిర్ధారణ కాకపోవడంతో.. ప్రమాదవశాత్తు జరిగినట్లుగా కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్ల వరకు నష్టం వాటిల్లింది. 36 బోట్లు పూర్తిగా దద్దమయ్యాయి.  తొమ్మిది బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.  బాధిత మత్స్యకారులకు ముఖ్యమంత్రి జగన్ భారీ ఊరటను కలిగించారు.  దద్ధమైన బోట్ల విలువలో 80% మేరా నష్టపరిహారంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, కారణాలను వెలికి తీయాలని తెలిపారు. దీంతో జగన్ ఉదారతపై మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వార్తను సాక్షి ప్రముఖంగా  ప్రచురించింది.

ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం

9
విభజనతో ఏపీకి తీవ్ర నష్టం… వైయస్ జగన్

అమరావతి : రాష్ట్రాల విభజన అంశంపై.. విభజన చట్టంలోని అంశాల పురోగతి మీద కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో  నేడు భేటీ జరగనుంది.  విభజనతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ బేటీలో ప్రస్తావించిన అంశాలపై అధికారులను సీఎం జగన్ దిశ నిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు  గడిచిన విభజన చట్టంలోని అంశాలు అలాగే ఉన్నాయన్నారు. అధికార వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధిలో భాగంగానే మూడు రాజధానులను ప్రకటించామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలపై మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో.. ఏపీ బృందం సమావేశం కానుంది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో రైలు, భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు. విశాఖ నుంచి రాయలసీమకు హైస్పీడ్ రైలు కారిడార్ లాంటి అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించాలని  జగన్ దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన వార్తను  సాక్షి బ్యానర్ ఐటంగా ప్రచురించింది. 

విశాఖ రైల్వేజోన్ సహా విభజన అంశాలపై కేంద్రీకరించాలి


భూగోళానికి పెను వినాశనం తప్పదా?  డేంజర్ మార్కు దాటేసామా?

గ్లోబల్ వార్మింగ్పై ఓ ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. నవంబర్ 17వ తేదీన తొలిసారి ఏకంగా రెండు డిగ్రీల భూతాపం పెరుగుదల  నమోదయిందని తెలిపింది. భూగోళాన్ని అత్యంత వేగంగా వినాశనం దిశగా నెడుతున్నామని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని లక్ష్యసాధనకు క్షేత్రస్థాయిలో ఏమి జరగడం లేదని చెప్పుకొచ్చింది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేనని.. మానవాళిని తీవ్ర ప్రమాదంలోకి నెట్టే చర్యలంటూ  తెలిపింది. మితిమీరిన కాలుష్యం, ఇంధనం వాడకం, అడ్డు అదుపు లేని పారిశ్రామికరణ, విచలవిడిగా అడవులు నరికివేత భూమిని చేరవేగంగా నాశనం వైపుకు వెళుతున్నాయని చెప్పుకొచ్చింది.

click me!