తిత్లీ తుఫాను ఎఫెక్ట్...మహిళా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు చెట్టుపైనే జాగారం

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 11:09 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రెండు రాష్ట్రాలను తిత్లీ తుపాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. కేవలం ఆస్తి నష్టాన్నే కాకుండా ప్రాణ నష్టానికి కూడా ఈ తుపాను కారణమయ్యింది.  ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 8 మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
 
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది. భారీగా కురిసిన వర్షాలతో ఈ ప్రాంతంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరద ప్రవాహంలో చిక్కుకుని ఒడిషాకు చెందిన ఓ మహిళ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఎలాగోలా ప్రాణాలతో బైటపడిన సంఘటన శ్రీకాకుళం  జిల్లాలో చోటుచేసుకుంది.

భువనేశ్వర్ కు చెందిన ఓ మహిళా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కాశీనగర్ ప్రాంతంలో కొత్తగా పోస్టింగ్ వేశారు. దీంతో వీరు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై కాశీనగర్ బయలుదేరారు. అయితే శ్రీకాకుళం మీదుగా వెళుతుండగా మెళియపుట్టి మండలం కొసమాళ వద్ద  మహేంద్ర తనయ నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ ప్రవాహంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోగా ఈ ముగ్గురు మాత్రం ఈదుకుంటూ ఓ చెట్టు వద్దకు చేరుకున్నారు. అయితే రాత్రంతా ఇదే చెట్టుపై ప్రాణభయంతో రాత్రంతా బిక్కు బిక్కు మంటూ గడిపారు.

ఉదయం వీరిని గుర్తించిన స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో మహిళా పోలీసు, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలతో సురక్షితంగా బైటపడ్డారు. తమను కాపాడిన స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీకి తిత్లీ ముప్పు: అప్పుడు ఇదే రోజుల్లో హుధూద్

తీరం దాటినా తప్పని ముప్పు.. మరో నాలుగు గంటల పాటు భారీ వర్షాలు

అర్థరాత్రి 12.10 a.m.. ఆయన పనిలో ఆయన

తీరం తాకిన తుఫాను: శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్: అల్లకల్లోలంగా సముద్ర తీరం

ముంచుకొస్తున్న ‘‘తిత్లీ’’.. వణుకుతున్న ఉత్తరాంధ్ర

click me!