కాంగ్రెస్ కి షాక్.. నిన్న నాదెండ్ల.. నేడు మరో కీలకనేత

Published : Oct 13, 2018, 10:02 AM IST
కాంగ్రెస్ కి షాక్.. నిన్న నాదెండ్ల.. నేడు మరో కీలకనేత

సారాంశం

దాదాపు 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించారు. డీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కాగా.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

ఏపీలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కీలకనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీలను వీడుతున్నారు. నిన్నటికి నిన్న.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. జనసేనలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన  ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా.. నాదెండ్ల అడుగుజాడల్లోనే మరో కీలకనేత జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.  ఆయనే చలమల శెట్టి రమేష్ బాబు. దాదాపు 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించారు. డీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కాగా.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ జనసేన విధానాలు నచ్చి ఆ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు. తనతోపాటు కొత్తపల్లి పార్టీ గ్రామ అధ్యక్షుడు పల్నాటి చంటి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. త్వరలో పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?