ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

Published : Dec 19, 2019, 01:35 PM ISTUpdated : Dec 20, 2019, 07:48 AM IST
ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు విషయమై ఏపీ సీఎం సీఎం వైఎస్ జగన్ చేసిన ప్కటనను నిరసిస్తూ వెలగపూడి రైతులు గురువారం నాడు రిలే దీక్షకు దిగారు. 

గుంటూరు: ఏపీకి మూడు రాజదానులు చేసే యోచన ఉన్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ గురువారం నాడు వెలగపూడిలో 29 గ్రామాల రైతులు  రిలే దీక్షలు చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.

Also read:ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...

అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు  యోచన ఉండే అవకాశం ఉందనే రీతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటన అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వెలగపూడిలో 29 గ్రామాల రైతులు రిలే దీక్షలకు దిగారు. 

మందడం నుండి రైతులు ర్యాలీగా సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. సీఎం జగన్ ‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులను అడ్డుకొన్నారు.

Also read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు వెలగపూడిలో  రిలేదీక్షలు చేస్తున్నారు. అభివృద్దిని వికేంద్రీకరణ చేయాలని  ఏపీ సీఎంను రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు కోరుతున్నారు.  

తమ నుండి భూములను స్వాధీనం చేసుకొనే సమయంలో రాజధానిని మారుస్తామని ఏనాడూ చెప్పలేదని రాజాని ప్రాంతానికి చెందిన రైతులు గుర్తు చేస్తున్నారు. తమ భూములను ఎలా ఇచ్చామో దే తరహాలో ఇవ్వాలని దీక్షలో పాల్గొన్న రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మద్దతు ప్రకటించారు.  

Also read:లోకేష్ తో వ్యాపారం... పచ్చి అబద్ధం... వేమూరి వివరణ

  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం