రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Dec 19, 2019, 12:47 PM IST
Highlights

రాజధానిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ రాజధాని రైతుల పరిరక్షణ మిటీ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని నిరసిస్తూ అమరావతి రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ గురువారం నాడు ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్  అసెంబ్లీ సాక్షిగా మూడు రోజుల క్రితం ప్రకటన చేశారు. అంతేకాదు ఏపీలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏపీ ప్రభుత్వం 585 జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

Also read:అమరావతిలో ఉద్రిక్తత: 'తెలంగాణ తరహాలో ఉద్యమం, చంపిన తర్వాతే మార్చండి'

ఈ పిటిషన్‌పై హైకోర్టు రెండు వర్గాల వాదనలను వింది. రాజధాని నిర్మాణం కోసం తమ వద్ద నుండి గత ప్రభుత్వం తమ నుండి భూములను సేకరించిందని రైతులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  కొత్త ప్రభుత్వం రాజధానిని మారుస్తానని చెప్పడం సరైంది కాదని రైతులు చెబుతున్నారు. రాజధాని ఏర్పాటు కోసం వైఎస్ జగన్ సర్కార్ నిపుణుల కమిటీని రద్దు చేయడాన్ని తప్పుబట్టారు.

Also read:ఏపీకి మూడు రాజధానులు: 29 గ్రామాల్లో బంద్ నిర్వహిస్తున్న రైతులు

ఈ కమిటీ ఏర్పాటు చేసేందుకు జారీ చేసిన 585 జీవోను రద్దు చేయాలని  రైతులు హైకోర్టును కోరారు. ఈ విషయమై ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేయాలని  ఆదేశించింది. ఈ  పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

click me!