బాబాయే కాలయముడు.. రీచార్జ్ చేస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి హత్యాచారం.. భీమవరం ఘటనలో వెలుగులోకి వాస్తవాలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలకలం రేకెత్తించిన బాలిక హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను వరసకు బాబాయి అయ్యే వ్యక్తి అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. రీచార్జ్ చేస్తానని నమ్మించి, ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడించారు.


ఓ బాలిక పాలిట బాబాయే కాలయముడిగా మారాడు. వావి వరసలు మరిచి మృగంలా ప్రవర్తించాడు. వరసకు సోదురుడైన వ్యక్తి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం జిల్లాలో వెలుగులోకి వచ్చిన దారుణ హత్యలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను హత్యాచారం చేసింది వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి అని తేలింది. 

పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత

Latest Videos

ఈ వివరాలను భీవవరం వన్ టౌన్ లో పోలీసులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. సిటీలోని 7వ వార్డు పరిధిలో ఉన్న లెప్రసీ కాలనీలో 28 ఏళ్ల మావుళ్లు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి భార్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఈ దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వీరిద్దరూ హాస్టల్ లో నరసాపురంలోని ఓ హాస్టల్ లో ఉంటూ.. అక్కడే చదువుకుంటున్నారు. 

దీంతో చాలా కాలంగా అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. వరసకు సోదరుడైన వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతంలోనే జీవిస్తున్నాడు. ఆయనకు ఏడో తరగతి చదివే 12 ఏళ్ల కూతురు ఉంది. ఆమెపై మావుళ్లు కన్నుపడింది. ఎప్పటిలాగే బాలిక తల్లిదండ్రులు మంగళవారం కూడా పనికి వెళ్లారు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలిక సెల్ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకోవాలని బయటకు వచ్చింది. దీనిని గమనించిన మావుళ్లు తానే రీచార్జ్ చేస్తానని నమ్మించాడు. తన ఇంట్లోకి రావాలని సూచించాడు. బాబాయే కదా పిలిచాడని నమ్మకంతో వెళ్లింది.

ఫేక్ మెసేజ్ కు భయపడి స్టూడెంట్ ఆత్మహత్య.. ఇంతకీ దానిని ఎవరు పంపించారు..? అందులో ఏముందంటే ?

కానీ లోపలికి వెళ్లిన తరువాత ఆ బాలికకు తన మనసులోని మాటను చెప్పడంతో ఆమె భయపడింది. వెంటనే బయటకు పరుగులు తీసింది. కానీ బాలికను అడ్డుకొని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. డెడ్ బాడీని భుజంపై వేసుకొని తన ఇంటి దగ్గరలో ఉన్న పొలాల్లో ఉంచాడు. కాగా.. సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాలో వెతికారు. కానీ బిడ్డ ఆచూకీ లభ్యం కాకపోవడంతో 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘కూతురు కోసం లండన్ వెళ్లిన సీఎం జగన్.. సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాలేరా ?’

కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరుసటి రోజు అంటే 28వ తేదీన ఉదయం పొలంలో బాలిక డెడ్ బాడీని గుర్తించారు. బాధితురాలి తల్లి ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే మావుళ్లు భయంతో భీమవరం డీటీ ఎదుట లొంగిపోయాడు. శుక్రవారం అతడిని అరెస్టు చేశామని ఎస్పీ ఎస్పీ రవిప్రకాశ్‌ చెప్పారు. 

click me!