రియల్ హీరో ఈ పోలీసు..కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..

Published : Feb 19, 2024, 11:41 AM ISTUpdated : Feb 19, 2024, 01:55 PM IST
రియల్ హీరో ఈ పోలీసు..కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..

సారాంశం

ఓ కారు అదుపుతప్పి నీటితో నిండి ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. లోపల ఉన్న ఏడుగురు బయటకి రాలేకపోయారు. అదే సమయంలో అటుగా వెళ్లున్న ఓ పోలీసు కానిస్టేబుల్ సాహసం చేసి వారిని రక్షించారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.

అది ఏపీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా. బెల్లంపూడి వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ఏడుగురు ఉన్నారు. ఆ కాలువ మొత్తం నీటితో నిండిపోయి ఉంది. లోపల ఉన్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అటుగా వెళ్లున్న ఓ కానిస్టేబుల్ కారును చూశారు. పరిస్థితి వెంటనే అర్థం చేసుకున్నారు. వెంటనే కాలువలోకి దూకారు. కారులో ఉన్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆయనను రియల్ హీరో అంటూ స్థానికులు ప్రశంసించారు.

అయోధ్య రాములోరికి తిరుమల వెంకన్న సాయం.. 

వివరాలు ఇలా ఉన్నాయి. కొనసీమ జిల్లా రాజోలులో ఏడుగురు కుటుంబ సభ్యులు తమ కారులో ఆదివారం రాజమహేంద్రవరంకు బయలుదేరారు. ఇందులో ఐదుగురు పెద్ద వాళ్లు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి తిరిగి స్వగ్రామానికి వారంతా బయలుదేరారు. ఆ కారు పి.గన్నవరం మండలంలోని బెల్లంపూడి ప్రాంతానికి చేరుకునే సరికి అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ

కారు లోపల ఉన్నవారికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్పీ ఆఫీస్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నెల్లి శ్రీనివాస్ ఆ దారిలో ప్రయాణిస్తున్నారు. కారు కాలువలోకి దూసుకుపోయి ఉండటంతో పరిస్థితి మొత్తం వేగంగా అర్థం చేసుకున్నారు. హుటాహుటిన ఆయన స్పందించి కాలువలోకి దిగారు.

కారు డోర్లు తెరిచి లోపల ఉన్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొంత సమయం తరువాత స్థానికులు అక్కడికి చేరుకొని సాయం చేశారు. కారులో ఉన్న వారి వస్తువులను ఒడ్డుకు చేర్చారు. అయితే కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయలు అయ్యాయి. సమయానికి కానిస్టేబుల్ శ్రీనివాస్ అటుగా వెళ్లకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. దీంతో ఆయనను స్థానికులు, ప్రయాణికులు అభినందనలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu