ప్లేస్ టైం నువ్వే డిసైడ్ చెయ్ ... సిద్ధమేనా జగన్ రెడ్డీ!: బాలయ్య స్టైల్లో చంద్రబాబు ఛాలెంజ్ 

By Arun Kumar P  |  First Published Feb 19, 2024, 11:30 AM IST

ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసిపి అదినేతకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు టిడిపి చీఫ్. 


అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సౌమ్యుడిగా పేరుంది. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులకు ధీటుగా విమర్శలు చేయడంలో, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఆయన వెనకడుగు వేస్తారని... అదే వైసిపి నాయకులకు అలుసుగా మారిందని టిడిపి నాయకులే అంటుంటారు. స్వయంగా నారా లోకేష్ సైతం తన తండ్రి సౌమ్యుడని... తాను అలా కాదని పలుమార్లు కామెంట్స్ చేసారు. ఇలాంటి చంద్రబాబు ఇటీవల జైలుకు వెళ్లివచ్చిన తర్వాత దూకుడు పెంచారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రత్యర్థులకు వారి స్టైల్లోనే జవాభిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ చొక్కా మడతబెట్టాలంటే... మేము కుర్చీలు మడతబెడతామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా నేటి రాజకీయాలకు తగినట్లుగా మాటల ఘాటు పెంచిన చంద్రబాబు తాజాగా ముఖ్యమంత్రికి ఓపెన్ ఛాలెంజ్ చేసారు.  

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు గుర్తుచేసారు. ఇలా గత ఎన్నికల ప్రచారంతో పాటు వివిధ సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు, హామీలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు చంద్రబాబు. ఈ సందర్భంగా తన బామ్మర్ది బాలకృష్ణ స్టైల్లో సీఎం జగన్ కు సవాల్ విసిరారు టిడిపి అధినేత.  

Latest Videos

Also Read  ఎవరిది స్వర్ణ యుగమో, ఎవరిది రాతి యుగమో తేలుద్దాం , చర్చకు రా : జగన్‌కు చంద్రబాబు సవాల్

''సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి....బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి....విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి....ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ?'' అంటూ వైసిపి నిర్వహిస్తున్న సిద్దం సభలపై చంద్రబాబు సెటైర్లు వేసారు. 

అతగాడు మీడియా వాళ్ళ ప్రశ్నలకే సమాధానం చెప్పలేక, "సాయి రెడ్ది విల్ ఆన్సర్" అని పారిపోయే రకం. ఇక మీతో చర్చకి అంటే...

ఏమి ? ఏమంటావ్ ? దమ్ముందా ? ధైర్యం ఉందా ? సీమ బిడ్డ గారు ఛాలెంజ్ విసిరారు, రెడీ నా ? లేక ఎప్పటిలాగే ప్యాలెస్ లో దాక్కుంటావా ? … https://t.co/ODMdz8Kc2Q

— Telugu Desam Party (@JaiTDP)

 

''నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది...ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది'' అని చంద్రబాబు హెచ్చరించారు.  

బూటకపు ప్రసంగాలు చేయడం కాదు... అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామా? అని వైఎస్ జగన్  కు ఛాలెంజ్ చేసారు చంద్రబాబు. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం నువ్వే చెప్పు... ఎక్కడికైనా వస్తా... దేనిమీదైనా చర్చిస్తా... నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ! అంటూ బహిరంగ సవాల్ విసిరారు టిడిపి చీఫ్ చంద్రబాబు. 
 

click me!