లీడర్ కు ఆవేశం పనికి రాదు, ఇంకా ఎదగాలి: పవన్ పై టీజీ ఎదురుదాడి

Published : Jan 23, 2019, 06:06 PM IST
లీడర్ కు ఆవేశం పనికి రాదు, ఇంకా ఎదగాలి: పవన్ పై టీజీ ఎదురుదాడి

సారాంశం

తనను పెద్ద మనిషి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు తాను ఒక్కటే చెప్పబోతున్నానని పవన్ ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని కానీ ఇలా వ్యాఖ్యానించడం  సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సింది ఎంతో ఉందని కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. లీడర్లకు ఆవేశం పనికిరాదంటూ పవన్ కి హితవు పలికారు. కార్యకర్తలకు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు కానీ లీడర్లకు ఆవేశం ఉండరాదన్నారు. 

పార్టీ అధినేతలకు ఆవేశం ఉంటే దెబ్బతింటారని వారితోపాటు వారిని నమ్ముకున్న ప్రజలు కూడా దెబ్బతింటారన్నారు. తాను మాట్లాడిన మాటలను  పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించారు. స్క్రోలింగ్ చూసి స్పందించడం అది నాయకుడి లక్షణం కాదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. 

తనను పెద్ద మనిషి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు తాను ఒక్కటే చెప్పబోతున్నానని పవన్ ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని కానీ ఇలా వ్యాఖ్యానించడం  సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సింది ఎంతో ఉందని కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 

పవన్ యువకుడు అని అతనికి బోలెడంత వయసు ఉందని ఎంతో ఎత్తుకు ఎదగాలని కానీ ఇలాంటి అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది పడక తప్పదన్నారు. ఒక్కసారి తాను మాట్లాడింది పవన్ కళ్యాణ్ వినాలని తాను మాట్లాడిన విషయంలో ఎక్కడా పవన్ ని అగౌరవ పరచలేదని స్పష్టం చేశారు.  

 ఈ వార్తలు కూడా చదవండి

టీజీ వ్యాఖ్యల ఎఫెక్ట్: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్ 

దోపిడీ చేస్తే తాట తీస్తా, మైనింగ్ జోలికి వస్తే ఇక అంతే : టీడీపీకి పవన్ హెచ్చరిక

అదుపుతప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని జాగ్రత్త : టీజీ వెంకటేష్ కు పవన్ వార్నింగ్

గుట్టు విప్పిన టీజీ వెంకటేష్: జనసేనతో టీడీపి పొత్తు

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం