అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

By narsimha lodeFirst Published Sep 23, 2018, 5:05 PM IST
Highlights

అరకు నియోజకవర్గంలోని లిప్పిట్టిపుట్టు  వద్ద మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేయడంపై  స్థానికులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అరకు: అరకు నియోజకవర్గంలోని లిప్పిట్టిపుట్టు  వద్ద మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేయడంపై  స్థానికులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డుబ్రీగుంట పోలీస్ స్టేషన్‌పై  స్థానికులు దాడికి పాల్పడ్డారు. గెస్ట్‌హౌజ్‌పై నిప్పు పెట్టారు.

 

ఆదివారం నాడు  ఉదయం మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే  సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మృతి చెందారు.  అయితే పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని  స్థానికులు ఆరోపిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  డుబ్రీగుంట పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. స్టేషన్ లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని గెస్ట్ హౌజ్‌కు నిప్పు పెట్టారు.మృతదేహాలను డుబ్రీగుంట పోలీ‌స్‌స్టేషన్ వద్ద పెట్టి ఆందోళన చేశారు. మరికొందరైతే స్టేషన్లపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు అరకు పోలీస్ స్టేషన్ పై కూడ దాడికి పాల్పడ్డారు.

 

"

గ్రామదర్శిని కార్యక్రమంలో సర్వేశ్వరరావు పాల్గొంటారని అరకు పోలీసులకు సమాచారం ముందే ఇచ్చినా కూడ పోలీసులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు మూడు రోజులుగా  మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నా పట్టించుకోలేదని పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు.

అరకులో కానిస్టేబుల్ పై దాడికి పాల్పడడంతో గాయాలయ్యాడు. ఈ రెండు పోలీస్‌స్టేషన్లపై  స్థాినికులు దాడులకు పాల్పడ్డారు.  స్టేషన్‌లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

సంబంధిత వార్తలు

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

click me!