
ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకునే వారి కోసమే జనసేన పార్టీ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జనసేనలోకి వచ్చే వారు ప్రజలపై అంకితభావం, సేవ చేయాలనుకునే ఆకాంక్ష ఉండాలని, అలాంటి తపన ఉన్నవారిని కచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.
జనసేనలో కుల, మతాలకు చోటు ఉండదని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం పవన్ తనకు చిన్నప్పుడు చదువు నేర్పిన గురువులను సన్మానించారు.