విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు నిరసనకు దిగారు, రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్నపాత్రుడు నిరసనను విరమించాలని పోలీసులు కోరారు.
నర్నీపట్నం: టీడీపీ చీప్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. Chandrababu సతీమణి Bhuvaneshwariపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తన నివాసం నుండి ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు మహిళలతో కలిసి దీక్ష చేయాలని భావించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీక్షా శిబిరం వద్దకు అయ్యన్నపాత్రుడు బయలు దేరారు. . దీంతో అయ్యన్నపాత్రుడిని పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు.దీంతో Ayyannapatrudu రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు.
తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో లాఠీచార్జీ చేయడాన్ని అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. అయ్యన్నపాత్రుడు ఆందోళన గురించి తెలుసుొన్న టీడీపీ కార్యకర్తలు నర్సీపట్నం చేరుకొన్నారు. అయ్యన్నపాత్రుడు ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. టీడీపీ క్యాడర్ ను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.తమ పార్టీ నాయకులు,కార్యకర్తలను ఈ ర్యాలీకి రాకుండా పోలీసులు నిన్న రాత్రి నుండి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులకు ఫోన్ చేసి రావొద్దంటున్నారన్నారు.చట్టసభల్లో మహిళలను ఉద్దేశించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైందేనా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
undefined
also read:నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు,ప్రజల దృష్టి మరల్చేందుకే...: మూడు రాజధానుల చట్టం విత్‌డ్రా పై లోకేష్
ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు తన భార్యను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తాను అసెంబ్లీలో ప్రకటన చేస్తానని చెప్పారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ అయింది ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో తన భార్య గురించి వైసీపీ సభ్యులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలో చంద్రబాబు కంటతడి పెట్టారు.అయితే తాము చంద్రబాబు సతీమణి గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు,తో పాటు సీఎం జగన్ కూడా ప్రకటించారు. కుప్పంతో పాటు రాష్ట్రంలోని మున్పిపల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ప్రస్టేషన్ తో చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యవహరించాడన్నారు.చంద్రబాబుకు ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదన్నారు.తన తల్లిపై ఉపయోగించిన అభ్యంతరకర భాష గురించి ప్రజల దృష్టిని మరల్చేందుకు మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకొనే బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని లోకేష్ ఇవాళ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఇవాళ పర్యటించారు.
మరో వైపు కుప్పంలో ఓటమితో చంద్రబాబు ప్రస్టేషన్ లోకి వెళ్లాడని వైసీపీ నేతలు విమర్శించారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు. బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు.