టాలీవుడ్‌కు జగన్ స్ట్రోక్: బెనిఫిట్ షోలు రద్దు, ఇకపై నాలుగు ఆటలే.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

Siva Kodati |  
Published : Nov 24, 2021, 03:39 PM ISTUpdated : Nov 24, 2021, 03:45 PM IST
టాలీవుడ్‌కు జగన్ స్ట్రోక్: బెనిఫిట్ షోలు రద్దు, ఇకపై నాలుగు ఆటలే.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) టాలీవుడ్‌కు (tollywood) షాకిచ్చింది. రాష్ట్రంలో బెనిఫిట్ షోలను (benefit show) రద్దు చేసింది సర్కార్. ఇకపై సినిమా హాళ్లలో నాలుగు షోలు మాత్రమే నడవనున్నాయి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు వుంటుందని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) టాలీవుడ్‌కు (tollywood) షాకిచ్చింది. రాష్ట్రంలో బెనిఫిట్ షోలను (benefit show) రద్దు చేసింది సర్కార్. ఇకపై సినిమా హాళ్లలో నాలుగు షోలు మాత్రమే నడవనున్నాయి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు వుంటుందని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఆన్‌లైన్ టికెటింగ్‌పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పేర్ని నాని (perni nani) . ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తక్కువ రేటుకు సినిమా టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. సినిమా వాళ్లకు ఇబ్బందేమి లేదని.. ఇబ్బందంతా కొన్ని రాజకీయ పార్టీలకేనని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ (ap cinematography act)బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే వాహన పన్నుల చట్ట సవరణ బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ (rrr movie ), పుష్ప (pushpa movie)  వంటి సినిమాలకు పెద్ద దెబ్బ కలగనుంది. 

ALso Read:ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం: జగన్ సర్కార్ దూకుడు, 20న కీలక సమావేశం.. వీరికి ఆహ్వానం

పెద్ద సినిమాలు విడుదలైన తొలి రెండు రోజులు టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుంటున్నారు నిర్మాతలు. అదే సమయంలో బెనిఫిట్ షో పేరుతో ముందస్తుగానే సినిమాని థియేటర్లలో ప్రదర్శిస్తూ టికెట్ రేట్లను ఐదారు రెట్లు ఎక్కువకి అమ్ముకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని అధికారికంగానే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. అయితే వైసీపీ హయాంలో బెనిఫిట్ షో వ్యవహారానికి బ్రేక్ పడింది. 

కరోనాకి ముందు కొన్ని పెద్ద సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థని కూడా తెరపైకి తేవడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఇబ్బందిని నేరుగా బయటపెట్టకుండా, థియేటర్ల యాజమాన్యాలు ఇబ్బంది పడతాయి, వారిని ఆదుకోండి అంటూ నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గకుండా.. తన నిర్ణయానికే కట్టుబడి చట్ట సవరణ ద్వారా టాలీవుడ్‌కు స్ట్రోక్ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్