విశాఖలో తహసీల్దార్ దారుణహత్య.. ఇంట్లోకి దూరి, ఇనుపరాడ్లతో దాడి చేసి...

By SumaBala Bukka  |  First Published Feb 3, 2024, 7:12 AM IST

కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది


విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను ఎవరో దారుణంగా హత్య చేశారు. కొమ్మాదిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన ఉంటే అపార్ట్ మెంట్ గేట్ దగ్గరే రమణయ్య మీద ఇనుపరాడ్ తో దాడిచేశారు. అనుకోని ఈ ఘటనతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణయయ మృతి చెందారు. రమణయ్య ఇటీవలే విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. 

కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది. రాత్రి ఒంటిగంట దాటాక సీపీ రవిచంద్రన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. విశాఖలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అర్థరాత్రి రమణయ్య ఇంటి మీద దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా పొట్టనపెట్టుకున్నారు. 

Latest Videos

కొమ్మాదిలో ఎమ్మార్మో రమణయ్య హత్యకు ల్యాండ్ మాఫియానే కారణం అని తెలుస్తోంది. రమణయ్య విధి నిర్వహణలో కఠినంగా ఉంటారని తెలుస్తోంది. రాత్రి ఒంటిగంట దాటాక సీపీ రవిచంద్రన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. విశాఖలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అర్థరాత్రి రమణయ్య ఇంటి మీద దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా కొట్టారు. వెంటనే అలర్ట్ అయిన వాచ్ మెన్ కుటుంబసభ్యులకు విషయం తెలుపగా, వారు కిందికి దిగేసరికి దుండగులు పారిపోయారు. 

వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అయితే ఆయనను ఎవరో కక్షగట్టి హత్య చేశారని అనుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో స్థానిక నాయకులు, పోలీసులు భారీగా రమణయ్య ఇంటికి చేరుకుంటున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ఘటనకు ముందు తహసీల్దార్ తో ఇద్దరు వ్యక్తులు మాట్లాడి వెళ్లారు. ఆ తరువాత మాస్క్ పెట్టుకుని వచ్చిన మరో వ్యక్తి తహసీల్దార్ మీద దాడికి దిగాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

click me!