ప్రత్యేక హోదాపై ఆందోళన: కాంగ్రెస్ వ్యూహమిదీ...

By narsimha lode  |  First Published Feb 2, 2024, 5:15 PM IST


ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆందోళనకు దిగింది.  రానున్న రోజుల్లో ఈ అంశాన్ని మరింత విస్తృతంగా  ఆ పార్టీ ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు.


అమరావతి: ప్రత్యేక హోదా ను  కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రచార అస్త్రంగా చేయాలని భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో  కనీసం  15 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే  వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంది. అంతేకాదు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలను  ఆ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను కూడ కట్టబెట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో  ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది.  రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా అంశం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. రాష్ట్ర విభజన చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  రాజకీయంగా నష్టపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో  కీలక నేతలు ప్రత్యామ్నాయమార్గాలు చూసుకున్నారు. కొందరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఆ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు  సాగుతున్నారు .

Latest Videos

undefined

ప్రత్యేక హోదా అంశం తెరమీదికి తీసుకు రావడం ద్వారా  ఎంపీ స్థానాలపై  ఆ పార్టీ ఫోకస్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది నుండి ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ మెరుగైన ఓట్లు తెచ్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఏపీ రాష్ట్రంలోని వైఎస్ఆర్‌సీపీ, ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త ప్రజా ప్రతినిధులు, నేతలను తమ పార్టీల్లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.  

also read:అటు అన్నా, ఇటు చెల్లి: కడప రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి?

ప్రత్యేక హోదాపై  తాము ఇంకా కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ప్రత్యేక హోదాపై తొలి సంతకం అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని రగల్చడం ద్వారా  రాజకీయంగా ప్రయోజనం పొందాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

also read:ప్రత్యేక హోదా అంటే ఏమిటి: లాభాలెన్ని

అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను నెరవేర్చాలనే డిమాండ్ తో  కాంగ్రెస్ పార్టీ ఇవాళ  న్యూఢిల్లీలో ఆందోళనకు దిగింది.మరో వైపు వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడ తమ వైపునకు తిప్పుకోవాలని ఆ పార్టీ  టార్గెట్ పెట్టుకుంది.  ఈ క్రమంలోనే  జగన్ సర్కార్ పై షర్మిల దూకుడుగా విమర్శలు చేస్తుంది. 
 

click me!