ఓటర్ లిస్టుపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఫిర్యాదులు.. ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

By Asianet NewsFirst Published Dec 8, 2023, 5:34 PM IST
Highlights

ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయంటూ ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా స్పందించారు. ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. 

గత కొంత కాలంగా ఏపీలోని ఓటర్ల లిస్టుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కలిశారు. తెలంగాణలో ఓటు ఉన్న వారికి ఏపీలోనూ ఓటు హక్కు ఉందని చెప్పారు. వారి ఏపీలో ఓటు వేయకుండా చూడాలని ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నాయకులు కూడా ఇదే విధంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. 

వైసీపీ ఓట్ల అవకతకలకు పాల్పడుతోంది - ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

Latest Videos

తాగాజా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని, మరణించిన వారి ఓట్లను తీసివేయాలని కోరారు. ఇంకా పలు విషయాలపై ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అయితే ఇలా రెండు పార్టీలు ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు చేశారు. 

ప్రభుత్వాలు ప్రజలను బద్దకస్తులుగా మారుస్తున్నాయి- చిన జీయర్ స్వామి

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనుంది. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని సీఈవో స్పష్టం చేశారు. ఒకరికి పలు చోట్ల ఓటు హక్కు ఉండటం నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు - కేంద్ర మంత్రి అమిత్ షా

ఫామ్‌ -6 ద్వారా కొత్త ఓటు మాత్రమే నమోదు చేయాలని సీఈవో పేర్కొన్నారు. అలాగే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారి దగ్గర నుంచి తప్పకుండా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పారు. ఆ డిక్లరేషన్ లో తమకు ఎక్కడా ఓటు హక్కు లేదని స్పష్టంగా చెప్పాలని తెలిపారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. అలా చేస్తే జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. 

click me!