వైసీపీ ఓట్ల అవకతకలకు పాల్పడుతోంది - ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

By Asianet NewsFirst Published Dec 8, 2023, 4:14 PM IST
Highlights

ఓటర్ల లిస్టులో అనేక తప్పులు కనిపిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అనేక నియోజకవర్గాలలో ఓట్ల డబుల్ ఎంట్రీలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. చనిపోయిన వారి ఓట్లు కూడా దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ ఓట్ల డబుల్ ఎంట్రీలు కనిపిస్తున్నాయని తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు కూడా దర్శనమిస్తున్నాయని అన్నారు. శుక్రవారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు ఈ విషయాలను ప్రస్తావించారు. 

కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు, లోకేష్

Latest Videos

ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని అన్నారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని కోరారు. ఇంటింటి సర్వేలో బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు  ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలని తెలిపారు.

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. అర్హత లేని వారికి కూడా ఫామ్ –6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో తాము గతంలోనే అభ్యంతరాలు తెలిపామని.. కానీ ఇప్పటికీ వాటిపై దృష్టిపెట్టలేదని చెప్పారు.

ప్రభుత్వాలు ప్రజలను బద్దకస్తులుగా మారుస్తున్నాయి- చిన జీయర్ స్వామి

ఎన్నికల అధికారులు ఆఫ్ లైన్ లో గానీ, ఆన్ లైన్ లో గానీ బల్క్ గా వచ్చే ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించకూడదని చంద్రబాబు నాయుడు సూచించారు. ఓట్లను తొలగించాలని కోరే వారు దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని అన్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఎలాంటి విచారణ జరపకుండా, కేవలం తెల్ల పేపర్ పై రాసి ఇస్తేనే ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా ఓటర్లకు ఈఆర్ఓలు నోటీసులు జారీ చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఫైనల్ లిస్టులు ఓట్ల అవకతవకలు జరకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

click me!