ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

By Nagaraju penumalaFirst Published Jul 11, 2019, 2:41 PM IST
Highlights

తాను సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. రైతు సదస్సుకు టీడీపీ వీరాంజనేయస్వామి హాజరైతే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యేను అలా అడ్డుకోవడం సరికాదన్నారు. నీతులు చెప్పడం కాదు మంచిని ఆచరించాలన్నారు. అంత  దౌర్జన్యం పనికిరాదన్నారు.  

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ క్షమాపణలు చెప్తేనే తాను ధన్యవాదాలు చెప్తానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీసీఎం చంద్రబాబు నాయుడు. కొండెపి నియోజకవర్గంలోని రైతు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఎస్టీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం అన్యాయమని చంద్రబాబు నిలదీశారు. 

అంతకుముందు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతీ ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో 40 మంది ఎమ్మెల్యేలు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడును కలిశామని ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 

అందుకు చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని అందుకు ఎమ్మెల్యేలంతా ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేత కూడా సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

తాను సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. రైతు సదస్సుకు టీడీపీ వీరాంజనేయస్వామి హాజరైతే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యేను అలా అడ్డుకోవడం సరికాదన్నారు. నీతులు చెప్పడం కాదు మంచిని ఆచరించాలన్నారు. 

అంత  దౌర్జన్యం పనికిరాదన్నారు. ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది రౌడీయిజాన్ని తలపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయాల్లో ఇలాంటి రౌడీయిజం పనికిరాదని వైసీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు నాయుడు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

click me!