బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయను.. వాళ్లు మంచి పని చేస్తున్నారనే మాట్లాడాను: కేశినేని కీలక వ్యాఖ్యలు

Published : May 22, 2023, 02:50 PM IST
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయను.. వాళ్లు మంచి పని చేస్తున్నారనే మాట్లాడాను: కేశినేని కీలక వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే  జగన్మోహన్‌పై కేశినేని నాని ప్రశంసలు కురిపించడం  తీవ్ర చర్చనీయాంశంగా  మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా కేశినేని నాని స్పందించారు. 

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే  జగన్మోహన్‌పై కేశినేని నాని ప్రశంసలు కురిపించడం  తీవ్ర చర్చనీయాంశంగా  మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా కేశినేని నాని స్పందిస్తూ.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానన్నారు. తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని చెప్పారు.  

వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా తనకు తెలుసునని చెప్పారు. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని అన్నారు. తనకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళని మరోసారి పేర్కొన్నారు. ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తాను చేయబోనని స్పష్టం చేశారు. బెజవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానని చెప్పారు.  

Also Read: వైసీపీ ఎమ్మెల్యే పై విజయవాడ ఎంపీ నాని ప్రశంసలు

తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానని గతంలో కేసీఆర్ చెప్పారని.. తాను కూడా బెజవాడ అభివృద్ది కోసం ముళ్ళ పందితోనైనా కలుస్తానని అన్నారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని అన్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, జగన్మోహన్‌ సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను అన్నారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా తనకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్