70ఏళ్లనాటి తప్పును సరిచేశారు: ఆర్టికల్ 370 రద్దుపై లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్

By Nagaraju penumalaFirst Published Aug 6, 2019, 4:30 PM IST
Highlights

జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారని లోక్ సభలో ప్రకటించారు. ఈ బిల్లుతో జమ్ము కశ్మీర్ కు మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ పై గత 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును నేటి కేంద్ర ప్రభుత్వం సరిచేసిందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్. ఒకే దేశం, ఒకే జెండా, ఒకటే రాజ్యాంగం అన్న నినాదానికి తెలుగుదేశం పార్టీ కట్టు బడి ఉందని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. 

జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారని లోక్ సభలో ప్రకటించారు. ఈ బిల్లుతో జమ్ము కశ్మీర్ కు మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. 

జమ్ముకశ్మీర్ పై గత 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును నేటి కేంద్ర ప్రభుత్వం సరిచేసిందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. లోక్ సభలో జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు అభినందనలు తెలిపారు గల్లా జయదేవ్.  

ఈ వార్తలు కూడా చదవండి

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం: లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు

 

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

ఆర్టికల్ 370 రద్దు చేస్తారా, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన


  

click me!